Asianet News TeluguAsianet News Telugu

జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ తో డెల్టా వైరస్ కు చెక్...!

జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్ ఒక్క డోసులో ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతున్న డెల్టా వేరియంట్‌ను న్యూట్రలైజ్ చేస్తుందని, వైరస్ సంక్రమణను సమర్థవంతంగా అరికడుతుందని తెలిపింది. 

Johnson & Johnson Says Its Covid Shot Neutralizes Delta Variant - bsb
Author
Hyderabad, First Published Jul 2, 2021, 11:26 AM IST

జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్ ఒక్క డోసులో ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతున్న డెల్టా వేరియంట్‌ను న్యూట్రలైజ్ చేస్తుందని, వైరస్ సంక్రమణను సమర్థవంతంగా అరికడుతుందని తెలిపింది. 

ఈ మేరకు కంపెనీ ఒక ప్రకటనలో తెలిసింది. ఇందులో ‘డెల్టాతో సహా అన్ని రకాల  వేరియంట్‌లకు వ్యతిరేకంగా తమ వ్యాక్సిన్ పనిచేస్తుందన్నారు. గత ఎనిమిది నెలల కాలంలో తమ టీకాలు తీసుకున్న వ్యక్తుల్లో బలమైన న్యూట్రలైజింగ్ యాంటీబాడీలు   ఉత్పత్తి అయ్యాయని గుర్తించామని కంపెనీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది’. డెల్టా వేరియంట్ మొట్టమొదటిసారిగా భారతదేశంలో  కనిపించింది. ఆ తరువాత  ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది.

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, రాబోయే వారాల్లో యు.ఎస్. లో డెల్టా వేరియంట్ తీవ్ర ప్రభావం చూపనుందని భావిస్తున్నారు. ప్రారంభంలో ఫైజర్ ఇంక్, మోడెర్నా ఇంక్ ల మెసెంజర్ ఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్ల కంటే జె అండ్ జె వ్యాక్సిన్అతి తక్కువ రక్షణను ఇస్తుందని భావించారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్నా కొంతమందిలో దీర్ఘకాలం వైరస్ సోకకుండా ఉండాలంటే బూస్టర్ షాట్స్ అవసరం పడుతుందని విశ్లేషించారు. 

ఈ నేపథ్యంలో ఇప్పుడు వచ్చిన ఫలితాలతో ‘మేం చాలా సంతోషంగా ఉన్నాం, వైరస్ వివిధ వేరియంట్లను మా వ్యాక్సిన్ సమర్థవంతంగా ఎదర్కొంటుంది. దీనికి వేరే బూస్టర్లు అవసరం లేదు’ అని జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లు, అంటువ్యాధుల గ్లోబల్ హెడ్ జోహన్ వాన్ హూఫ్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు.

ఈ వ్యాక్సిన్ మొదటి డోసుతో 29 రోజుల్లోనే డెల్టా వేరియంట్‌ను న్యూట్రలైజ్ చేసింది. తరువాత వైరస్ నుంచి శరీరానికి కావాల్సిన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసిందని కంపెనీ తెలిపింది.  

తాజా డేటా ను అనుసరించి వాన్ హుఫ్ మాట్లాడుతూ.. మా వ్యాక్సిన్లు తీసుకున్న సంవత్సరంలోపూ బూస్టర్లు తీసుకోవాలనే దాన్ని జాన్సన్ అండ్ జాన్సన్ నమ్మడం లేదు. ఒకవేళ బూస్టర్ అవసరం పడినా కూడా.. మా ఫార్ములా మార్చాల్సిన అవసరం ఉందని మేం అనుకోవడం లేదు అన్నారు.

శాస్త్రవేత్తలు, కొంతమంది వ్యాక్సిన్ తయారీదారులు కొత్త వేరియంట్లకు అనుగుణంగా తమ వ్యాక్సిన్ల ఫార్మెలాల్లో మార్పులు చేస్తున్నారు. దీని ద్వారా వైరస్ వేరియంట్లను సమర్థవంతంగా ఎదుర్కొనే టీకాలు రూపొందిస్తున్నారు. 

జె అండ్ జె గురువారం దీనికి సంబంధించిన రెండు అధ్యయన అంశాలను వెల్లడించింది. కంపెనీ తమ వ్యాక్సిన్ చివరి దశ క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్న 8 మంది రక్త నమూనాలు సేకరించింది. వీటిల్లో డెల్టా వేరియంట్ ను న్యూట్రలైజ్ చేసే యాంటీ బాడీలు ఉన్నాయో లేదో పరీక్షించింది. దీంతోపాటు వ్యాక్సిన్ మొదటి దశ ట్రయల్స్ లో పాల్గొన్న 20 మందిలో రోగనిరోధక వ్యవస్థ పనితీరు చాలా బాగా ఉందని తేలిందని బెత్ ఇజ్రాయెల్ డీకనెస్ మెడికల్ సెంటర్కు చెందిన డాన్ బరూచ్ విశ్లేషించారు.

దక్షిణాఫ్రికాలో మొట్టమొదట కనుగొనబడిన బీటా వేరియంట్ కంటే డెల్టా వేరియంట్‌కు రెస్పాండ్ అయ్యే టైట్రేస్ అని పిలిచే యాంటీబాడీలు తమ వ్యాక్సిన్ లో గణనీయంగా ఉన్నాయని కంపెనీ విడుదల చేసిన డేటా చూపించింది. J & J టీకా రెండవ డోసు ఒక వ్యక్తిలో యాంటీబాడీల సంఖ్యను పెంచుతుందని తెలిసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios