వాషింగ్టన్: అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ విజయం ఖాయమయ్యింది. దీంతో డెమోక్రటిక్ పార్టీ విజయోత్సవ సభను నిర్వహించింది. ఈ సభలో నూతన అధ్యక్షుడు బైడెన్ మాట్లాడుతూ...ఇకపై అమెరికాలో పాలన ఎలా సాగనుందో...అమెరికాను అభివృద్దికోసం ఎలా వ్యవహరించనున్నాడో వివరించాడు.  

''అమెరికన్లు తమ  భవిష్యత్ కోసం ఓటేశారు. మీరు నాపై వుంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. ట్రంప్ ఓడిపోయారు నేను కూడా ఒకటి రెండు ఎన్నికల్లో ఓడిపోయా. అమెరికా ప్రజలు స్ఫస్టమైన తీర్పునిచ్చారు. అమెరికా చరిత్రలో ఇదో రికార్డు. ప్రజలు ఆశించిన పాలన అందిస్తా'' అని హామీ ఇచ్చారు.  

''సంపూర్ణ విజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు. అమెరికా ప్రజలు స్ఫస్టమైన తీర్పునిచ్చారు. అమెరికా చరిత్రలో ఇదో రికార్డు. ప్రజలు ఆశించిన పాలన అందిస్తా.  కరోనా పరిస్థితుల్లో ముందుకొచ్చి గెలిపించిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు'' అని బైడెన్ అన్నారు.  

''ఇక నుండి అమెరికాలో ప్రతి కుటుంబం ఆరోగ్యంగా వుంటుంది. వర్ణవివక్ష లేకుండా అమెరికాను అభివృద్ది చేసుకుందాం. ప్రస్తుతం యావత్ ప్రపంచం అమెరికా వైపు చూస్తోంది. కాబట్టి సరికొత్త అమెరికా నిర్మాణానికి ట్రంప్ కూడా కలిసిరావాలి. ప్రతి అమెరికన్ కు తమ లక్ష్యాలను సాధించేందుకు అవకాశం వుంటుంది'' అని బైడెన్ అమెరికా ప్రజలకు వివరించారు.   

read more  బైడెన్‌కు తిలకం దిద్దుతున్న తెలంగాణ పూజారి, ఫోటో వైరల్

 గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడెన్ ఘన విజయం సాధించారు. అమెరికా 46వ అధ్యక్షుడిగా ఆయన త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. 284 ఎలక్టోరల్ ఓట్లతో బైడెన్ విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 213 ఓట్ల వద్దే నిలిచిపోయారు.

అన్ని ప్రాంతాలు, మతాలకు అతీతంగా రికార్డు స్థాయిలో అమెరికన్లు మార్పును కోరుకుంటున్నారని ఫలితాల్లో స్పష్టంగా తెలుస్తోంది. కరోనా వైరస్ కట్టడికి తొలి రోజు నుంచే ప్రణాళికలను అమలు చేస్తానని జో బైడెన్ ఇప్పటికే ప్రకటించారు.  

అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ గెలవాలని చాలా మంది భారతీయులు కోరుకున్నారు. దీనికి ప్రధాన కారణం ట్రంప్ వీసా రూల్స్‌ను కఠినతరం చేయడమే. దీనికి తోడు కమలా హారిస్ ఉపాధ్యక్ష బరిలో నిలవడం కూడా ఇండియన్స్‌ను బైడెన్ వైపు మొగ్గేలా చేసింది.

బైడెన్ కూడా తాను అధికారంలోకి వచ్చాకా.. పాత అమెరికాను తెస్తానని, వీసా రూల్స్‌ని సరళతరం చేస్తానని చెప్పారు. అంటే ఇది నిజంగా జరుగుతుందా అంటే ప్రశ్నార్ధకమనే చెప్పాలి.

ట్రంప్ అమెరికన్లకు ఉద్యోగాలిస్తానంటే.. బైడెన్ ఇండియన్లకు ఉద్యోగాలు ఇస్తున్నారనే భావన కలగడం డెమొక్రాట్లకు అంత మంచి విషయం కాదు. దీనిని బట్టి బైడెన్.. చెప్పినంత తేలిగ్గా వీసా రూల్స్ మార్చబోరని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.