ఉక్రెయిన్ మీద దాడికి తెగబడిన రష్యాను వ్యతిరేకించడానికి, ఎదుర్కోవడానికి భారత్ సాహసం చేయలేకపోతుందని.. అది రష్యాకు వణుకుతోందని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

వాషింగ్టన్ : ఉక్రెయిన్‌పై రష్యా దాడిపై భారత్ "చంచలమైన" ప్రతిస్పందన చూపిస్తుందని.. దీంతో వాషింగ్టన్ మిత్రదేశాలలో భారతదేశం మినహాయింపుగా ఉందని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సోమవారం అన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు వ్యతిరేకంగా యునైటెడ్ ఫ్రంట్ కోసం NATO, యూరోపియన్ యూనియన్, కీలక ఆసియా భాగస్వాములతో సహా US నేతృత్వంలోని కూటమిని బిడెన్ ప్రశంసించారు.

రష్యా కరెన్సీ, అంతర్జాతీయ వాణిజ్యం, అత్యాధునిక సాంకేతికత వస్తువుల అమ్మకాన్నిి నిర్వీర్యం చేసే లక్ష్యంతో ఏర్పాటు చేసిన అనేక ఆంక్షలు ఇందులో ఉన్నాయి. అయితే, క్వాడ్ గ్రూప్‌లోని తోటి సభ్యుల మాదిరిగా కాకుండా.. ఆస్ట్రేలియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్, భారతదేశం రష్యా చమురు కొనుగోలును కొనసాగిస్తోంది. ఐక్యరాజ్యసమితిలో మాస్కోను ఖండిస్తూ ఓట్లలో చేరడానికి నిరాకరించింది.

వాషింగ్టన్‌లో US వ్యాపార నాయకుల సమావేశంలో ప్రసంగిస్తూ, బిడెన్ "ఈ యునైటెడ్ ఫ్రంట్ పసిఫిక్‌లో NATO అంతటా విస్తరించి" ఉందని అన్నారు. "క్వాడ్ లోని దేశాల్లో కొన్నింటిలో భారతదేశం కొంతవరకు అస్థిరమైనది, కానీ పుతిన్ దూకుడును ఎదుర్కునే విషయంలో జపాన్ చాలా బలంగా ఉంది, ఆస్ట్రేలియా కూడా అంతే బలంగా ఉంది." అన్నారు. అంతేకాదు.. పుతిన్ "నాటోను విభజించగలనని భావిస్తున్నాడు" అని బిడెన్ చెప్పుకొచ్చారు. ఇంకా చెబుతూ... "నాటో చరిత్రలో ఇప్పటివరకు ఇంత బలంగా, ఐక్యంగా ఎప్పుడూ లేదు’’ అని కూడా అన్నారు. 

పాశ్చాత్య దేశాలు మాస్కోను ఏకాకిని చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, భారతీయ చమురు శుద్ధి సంస్థలు రష్యన్ చమురును రాయితీపై కొనుగోలు చేయడం కొనసాగించాయి. ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ముడి చమురు వినియోగదారు తన అవసరాలలో దాదాపు 85 శాతం దిగుమతులపై ఆధారపడుతున్నారని, రష్యా ఇందులో ఒక శాతం కంటే తక్కువ "మార్జినల్" సరఫరా చేస్తుందని భారత ప్రభుత్వ అధికారి గత వారం చెప్పారు.

కానీ "ఉక్రెయిన్ వివాదం తర్వాత చమురు ధరల పెరుగుదల ఇప్పుడు సవాళ్లను ముందు పెడుతోంది. భారతదేశం పోటీ ఇంధన వనరులపై దృష్టి పెట్టాలి" అని అధికారి జోడించారు. చారిత్రాత్మకంగా మాస్కోతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్న న్యూఢిల్లీ, ఉక్రెయిన్‌లో హింసను అంతం చేయాలని పిలుపునిచ్చింది, అయితే ఐక్యరాజ్యసమితిలో మూడు ఓట్లకు దూరంగా ఉండి రష్యా దాడిని ఖండించింది.