జేమ్స్ వెబ్ టెలిస్కోప్ నుంచి ఫస్ట్ పిక్ రిలీజ్ అయింది. ఈ టెలిస్కోప్ తీసిన తొలి చిత్ర ప్రివ్యూను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌లు చూశారు. అనంతరం, ఈ చిత్రాన్ని విడుదల చేశారు. మంగళవారం ఈ టెలిస్కోప్ చిత్రాలను లైవ్‌లో బైడెన్ విడుదల చేయనున్నారు.
న్యూఢిల్లీ: జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన తొలి చిత్రాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సోమవారం శ్వేతసౌధంలో ప్రివ్యూ చూశారు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన చిత్రాలను నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీలు సంయుక్తంగా మంగళవారం విడుదల చేయనున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఓ చిత్రాన్ని ప్రివ్యూ చూశారు.
ఆ చిత్రంలో వేలాది గెలాక్సీలు కనిపిస్తున్నాయి. ఊహించని రీతిలో అసాధారణ వివరాలు మనకు ఆ చిత్రంలో కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని విడుదల చేస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఇది చారిత్రాత్మక రోజు అని అన్నారు. ఇది అమెరికా, సమస్త మానవాళికి చారిత్రక క్షణం అని వివరించారు. ఇది మన అందరికీ ఎంతో ఎగ్జయిటింగ్ మూమెంట్ అని ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అన్నారు. విశ్వానికి సంబంధించి సరికొత్త చాప్టర్ నేటితో మొదలు అవుతున్నదని వివరించారు.
నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ మాట్లాడుతూ, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ నుంచి విడుదలైన తొలి చిత్రం ఇదే అని వివరించారు. ఇప్పుడు మనం 13 బిలియన్ సంవత్సరాలు వెనక్కి వెళ్లి చూస్తున్నామని తెలిపారు. ఈ చిత్రంలో మీరు చూస్తున్న కాంతి 1300 కోట్ల సంవత్సరాలుగా ప్రయాణిస్తూనే ఉన్నదని అన్నారు ఈ చిత్ర విడుదలతో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పనులు అధికారికంగా మొదలుపెట్టినట్టుగా గుర్తించవచ్చని తెలిపారు. ఈ టెలిస్కోప్ మరెన్నో రహస్యాలను ఛేదించాల్సి ఉన్నదని పేర్కొన్నారు.
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కోసం 19 బిలియన్ డాలర్ల ఖర్చు అయింది. గతేడాది డిసెంబర్‌లో ప్రయో గించిన ఈ టెలిస్కోప్ అక్కడ నిర్దేశిత కక్ష్యలో సర్దుకోవడానికి ఆరు నెలల కాలం పట్టిందని వివరించారు.
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కు నిర్దేశించిన ఐదు టార్గెట్ల ను నాసా శుక్రవారం వెల్లడించింది. కారినా నెబ్యూలా, వాస్ప్ - 96b, దక్షిణాది రింగ్ నెబ్యూలా, స్టీఫెన్స్ క్వింటెట్, స్మాక్స్ 0723. ఈ టార్గెట్లను నాసా సభ్యులు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ, స్పేస్ టెలిస్కోప్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ బాల్టిమోర్‌లెలు కలిసే నిర్ణయం తీసుకున్నరు.
2021 డిసెంబర్‌లో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ మిషన్ లాంచ్ చేశారు. అప్పుడు ఈ టెలిస్కోప్ కేవలం 10 సంవత్సరాల మాత్రమే పని చేస్తుందని భావించారు. కానీ, దీని ఫ్యుయెల్ కెపబిలిటీతో 20 ఏళ్లపాటు ఆపరేట్ చేయవచ్చని శాస్త్ర వేత్తలు కనుగొన్నారు.
