మహిళల అణచివేతపై నర్గెస్ మొహమ్మదీ పోరాటం: ఇరాన్ మహిళకు నోబెల్ శాంతి పురస్కారం
ఇరాన్ మహిళకు నోబెల్ శాంతి బహుమతి దక్కింది. మానవ హక్కుల కార్యకర్త నర్గెస్ మొహమ్మదీకి నోబెల్ శాంతి అవార్డును కమిటీ ప్రకటించింది.
స్టాక్‌హోమ్: మహిళల అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఇరాన్ మానవ హక్కుల కార్యకర్త నర్గెస్ మొహమ్మదీకి ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ఇరాన్ లో మహిళలపై అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నర్గెస్ మొహమ్మదీకి నోబెల్ శాంతి బహుమతి దక్కింది.ఈ ఏడాది డిసెంబర్ 10న నోబెల్ శాంతి బహుమతిని మొహమ్మది అందుకుంటారు. 1895 లో నోబెల్ బహుమతుల ప్రధానోత్సవం ప్రారంభమైంది.
ఇరాన్ లో ప్రముఖ మానవ హక్కుల కార్యకర్తల్లో ఇరానీ మొహమ్మదీ ఒకరు.పోలీసుల కస్టడీలో ఉన్న కుర్దిష్ యువతి మహ్సా అమినీ మృతి చెందిన తర్వాత దేశంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. నోబెల్ శాంతి బహుమతి పొందిన నర్గెస్ మొహమ్మదీ 13 దఫాలు అరెస్టయ్యారు.ఐదు కేసుల్లో ఆమె దోషిగా ఉన్నారు.31 ఏళ్ల పాటు ఆమె జైలు జీవితం గడిపారు.154 కొరడా దెబ్బలను కూడ తిన్నారు.ఆమె న్యాయవాది . ప్రస్తుతం ఆమె టెహ్రాన్ జైలులో ఉన్నారు.
నోబెల్ బహుమతిని గెలుచుకున్న వారిలో నర్గెస్ మొహమ్మదీ 19 వ మహిళ.పిలిఫ్పిన్స్ కు చెందిన మరియా రెస్సా రష్యాకు చెందిన డిమిత్రి మురాటోవ్ తో సంయుక్తంగా ఈ అవార్డును దక్కించుకున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, యూఎన్ జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెర్రెస్ కూడ ఈ పదవికి పోటీలో ఉన్నారు