కరోనా వైరస్ పాజిటివ్ గా తేలిన ఇవాంకా ట్రంప్ పి.ఏ.....

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ పర్సనల్ సెక్రటరీ కరోనా పాజిటివ్ గా తేలాడు. వెంటనే ఇవాంకా ట్రంప్ కి, ఆమె భర్త కుష్ణర్ కి కూడా పరీక్షలను నిర్వహించారు. వారికి కరోనా పరీక్షల్లో నెగటివ్ అని తేలినట్టు అధికార వర్గాలు తెలిపాయి. 

Ivanka Trump's personal assistant has reportedly tested positive for the coronavirus

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ పర్సనల్ సెక్రటరీ కరోనా పాజిటివ్ గా తేలాడు. వెంటనే ఇవాంకా ట్రంప్ కి, ఆమె భర్త కుష్ణర్ కి కూడా పరీక్షలను నిర్వహించారు. వారికి కరోనా పరీక్షల్లో నెగటివ్ అని తేలినట్టు అధికార వర్గాలు తెలిపాయి. 

ఇవాంక పర్సనల్ సెక్రటరీ గత కొన్ని వారాలుగా ఆమె కు దూరంగానే ఉంటున్నాడు. అతడు తన ఇంటినుండి కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్టు ఇవాంక ట్రంప్ ఆఫీస్ వర్గాలు వెల్లడించాయి. 

ఇకపోతే తాజాగా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సహాయకుడు కూడా ఈ కరోనా వైరస్ బారినపడ్డాడు. అప్పుడు వెంటనే ట్రంప్ కి కూడా కరోనా పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే!

ఇదివరకే వైట్ హౌస్ అడ్వైసర్ భార్యకు, ఉపాధ్యక్షుడి ప్రెస్ సెక్రటరీకి కూడా ఈ కరోనా వైరస్ సోకినా విషయం విదితమే! ఈ కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ అధ్యక్షుడు, ఉపాధ్యక్షులకు ప్రతివారం కరోనా వైరస్ పరీక్షలను జరుపుతున్నారు. 

ఇకపోతే.... అమెరికాలో ఈ కరోనా వైరస్ వల్ల నెలకొన్న భయానక పరిస్థితులు హెచ్1 బీ వీసాపై కూడా పడింది. హెచ్ 1 బీ వీసాలను కొంత కాలంపాటు నిషేధించాలని అమెరికా ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా అయిన హెచ్ -1 బి.. సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే ప్రత్యేక వృత్తులలో విదేశీ కార్మికులను నియమించుకోవడానికి యుఎస్ లోని కంపెనీలను అనుమతిస్తుంది. H-1B వీసా హోదాలో US లో 500,000 మంది వలస కార్మికులు పనిచేస్తున్నారు.

"అధ్యక్షుడి ఇమ్మిగ్రేషన్ సలహాదారులు రాబోయే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు, ఈ నెలలో, కొన్ని కొత్త తాత్కాలిక, పని ఆధారిత వీసాల జారీని నిషేధించే అవకాశం ఉంది" అని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.

హెచ్1 బీ, హెచ్ 2 బీ, స్టూడెంట్ వీసాలపై కూడా అమెరికా ప్రభుత్వం త్వరలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఇదిలా ఉండగా...అమెరికాలో గల అత్యధిక టెక్ దిగ్గజాలు, ఇతర సంస్థలు.. హెచ్2 బీ వీసాదారులకు మార్కెట్‌లో సాధారణ వేతనాలతో పోలిస్తే తక్కువ వేతనాలు చెల్లిస్తున్నట్లు తేలింది. టెక్నాలజీ, సోషల్ మీడియా దిగ్గజ సంస్థలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, ఫేస్‌బుక్ సైతం ఇదే విధానాన్ని అవలంభిస్తున్నాయని తెలిపింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios