Asianet News TeluguAsianet News Telugu

మైనర్లకు మ్యూజిక్ పాఠాలు... టీచర్ వద్ద లక్షలకొద్దీ చిన్నారుల నీలిచిత్రాలు

చిన్నారులకు సంగీతం పాఠాలు చెప్పే ఓ మ్యూజిక్ టీచర్ వద్ద లక్షలకొద్దీ చిన్నారుల ఫోర్న్ వీడియోలు లభించడం ఇటలీలో కలకలం రేపింది.  

Italy Musician Caught With  child pornography images and videos
Author
Italy, First Published Dec 19, 2021, 7:50 AM IST

ఇటలీ: చిన్నారులపై అకృత్యాలు (child harassment), లైంగిక దాడులు, వేధింపులు ఒక్క మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఇలా చిన్నారులపై అఘాయిత్యాలు ఆగాలంటే వారిని జాగ్రత్తగా కాపాడుకోవడమే కాదు వారిపై దారుణాలను ప్రేరేపించే ఘటనలు, వ్యక్తులను కట్టడి చేయాల్సి వుంటుంది. ఇందులోభాగంగా చిన్నారులపై అఘాయిత్యాలకు ప్రేరేపించేలా లక్షలకొద్దీ చైల్డ్ పోర్నోగ్రపి (child pornography) వీడియోలను కలిగిన ఓ సంగీతకారుడి ను ఇటలీ (Italy) పోలీసులు అరెస్ట్ చేసారు. 

ఇటలీ పోలీసుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇటలీలోని మార్చే రీజియన్ లోని అంకోనా (ancona) సిటీలో ఓ సంగీతకారుడు (music teacher) చిన్నారులకు సంగీతం నేర్చించేవాడు. అయితే విశ్వసనీయ సమాచారంతో అతడి ఇంటిపై దాడిచేసిన పోలీసులకు లక్షలకొద్దీ చిన్నారుల నీలిచిత్రాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు లభ్యమయ్యాయి. 49ఏళ్ల వయసున్న అతడు దాదాపు 30ఏళ్ల వయసునుండే ఇలా చిన్నారుల నీలిచిత్రాల వీడియోల సేకరణ ప్రారంభించినట్లు పోలీసులు గుర్తించారు. 

చిన్నారులతో పెద్దలు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నట్లుగా వీడియోలన్నీ వున్నాయి. వీటిని వివిధ కేటగిరీలుగా విభజించి హార్డ్ డిస్క్ లోనే కాదు వివిధ రకాలుగా స్టోర్ చేసి వుంచాడు. ఇలా లక్షలకొద్దీ వీడియోలను అతడివద్ద గుర్తించిన పోలీసులు వాటన్నింటిని స్వాదీనం చేసుకుని అతడిని అరెస్ట్ చేసారు. 

read more  పాకిస్తాన్ లో దారుణం.. నలుగురు మహిళలను బట్టలూడదీసి, కొడుతూ.. వీధుల్లో ఊరేగించి, వీడియోతీసి...

అయితే నిందితుడి వద్ద సంగీతం నేర్చుకోడానికి వచ్చే చిన్నారులను ఏమయినా లైంగిక వేధింపులకు గానీ, వీడియోల చిత్రీకరణకు గానీ ఉపయోగించాడా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కానీ ఇప్పటివరకయితే అలాంటి ఆధారాలేవీ లభించలేవని ఇటలీ పోలీసులు వెల్లడించారు. 

ఇదిలావుంటే ఇండియాలో చిన్నారులు కామాంధుల చేతిలో నలిగిపోతున్న అనేక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఓ ప్రభుత్వ ఉద్యోగి తన కామవాంఛలు తీర్చుకోవడానికి సుమారు 50 మంది చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్ లో ఇటీవలే బయటపడింది.  

ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌ జిల్లాకు చెందిన రామ్‌భవన్‌ అనే వ్యక్తి  ప్రభుత్వ జూనియర్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడు బండ, చిత్రకూట్, హమీర్పూర్‌ జిల్లాల్లో 5 నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న దాదాపు 50 మంది చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రామ్‌భవన్‌ను బండ జిల్లాలో అరెస్టు చేసిన సీబీఐ అధికారులు న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. నిందితుడి ఇంటిలో నిర్వహించిన సోదాల్లో అధికారులు సైతం నిర్ఘాంతపోయారు.

read more  ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసు... నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

8 మొబైల్‌ ఫోన్లు, రూ.8 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌, ఇతర డిజిటల్‌ సాక్ష్యాలు, భారీ సంఖ్యలో చిన్నారుల లైంగిక వేధింపులకు సంబంధించిన మెటీరియల్స్‌, వీడియోలు రామ్‌భవన్ ఇంట్లో బయటపడ్డాయి.అంతేకాకుండా పోర్నోగ్రఫీకి సంబంధించిన ఆ సమాచారాన్ని షేర్ చేసుకునే విషయంలో అతడు పలువురు విదేశీయులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఈ మెయిల్స్‌ పరిశీలించగా తెలిసింది.

తాను చేసే అసాంఘిక కార్యకలాపాల గురించి చిన్నారులు బయట చెప్పకుండా ఉండేందుకు మొబైల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు వారికి రామ్‌భవన్ గిఫ్ట్‌లుగా ఇచ్చేవాడు. ఇదే విషయాన్ని నిందితుడు విచారణలో అంగీకరించాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios