Asianet News TeluguAsianet News Telugu

భయపెడుతున్న కరోనా.. ఒక్క రోజులో 475మంది మృతి

గడిచిన 24గంటల్లో ఇటలీలో దాదాపు 475మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్యను బట్టి.. ఇటలీలో కరోనా ప్రభావం ఏ మేర ఉందో అర్థంచేసుకోవచ్చు. కరోనా వైరస్ కారణంగా ఒకే రోజులో ఇంత మంది చనిపోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

Italy coronavirus deaths rise by record 475 in a day
Author
Hyderabad, First Published Mar 19, 2020, 10:57 AM IST

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మొదట్లో దీనిని ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు కానీ.. ప్రస్తుతం మారుతున్న పరిస్థితులు చూస్తుంటే భయంతో వణికిపోతున్నారు.  చైనాలోని వుహాన్ లో తొలుత మొదలైన ఈ వైరస్ ఇప్పుు ప్రపచంలోని దాదాపు అన్ని దేశాలకు పాకేసింది. అయితే..చైనా తర్వాత ఆ ప్రభావం ఎక్కువగా ఇటలీలోనే కనపడుతోంది.

Also Read కరోనాకు వ్యాక్సిన్ : మనుషులపై ‘‘mRNA-1273’’ ట్రయల్స్‌ ప్రారంభం...

గడిచిన 24గంటల్లో ఇటలీలో దాదాపు 475మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్యను బట్టి.. ఇటలీలో కరోనా ప్రభావం ఏ మేర ఉందో అర్థంచేసుకోవచ్చు. కరోనా వైరస్ కారణంగా ఒకే రోజులో ఇంత మంది చనిపోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. విచిత్రం ఏమిటంటే... వైరస్ పుట్టిన చైనాలో కూడా ఒకే రోజు ఇంత మంది చనిపోకపోవడం గమనార్హం.

కాగా.. ఇప్పటి వరకు ఇటలీలో 2,978మంది కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇక వైరస్ సోకి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 35,713కి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా 8వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోగా... 2లక్ష మంది కరోనా సోకి ఆస్పత్రులపాలయ్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios