టర్కీలోని ఇస్తాంబుల్ లో జరిగిన పేలుడు ఘటనకు సంబంధించిన అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు టర్కీ మంత్రి సులేమాన్ సోయ్లూ ధ్రువీకరించారు.
ఇస్తాంబుల్ : టర్కీ ప్రధాన నగరం ఇస్తాంబుల్ లో చోటు చేసుకున్న భారీ పేలుడు ఘటన ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఆదివారం సాయంత్రం ఇస్తిక్ లాల్ అవెన్యూ రద్దీ మార్కెట్ లో పేలుడు సంభవించింది. ఈ దాడికి ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఇక ఈ పేలుడు ఘటనలో మరో 81మంది గాయపడ్డారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అత్యంత రద్దీ ఉండే ఆ వీధిలో సదరు దుండగుడు బాంబును వదిలేసి వెళ్లినట్టు అనుమానిస్తున్నారు.
అనుమానితుడి అరెస్ట్ విషయాన్ని టర్కీ మంత్రి సులేమాన్ సోయ్లూ సోమవారం ధ్రువీకరించారు. మరోవైపు ఈ దాడిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్.. ఇదొక ఉగ్రవాద దాడి అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు ఆయన. ఇదిలా ఉంటే 2015-16లో ఇస్తిక్ లాల్ స్ట్రీట్ లో పేలుడు జరిగి సుమారు 500 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.
ఇస్తాంబుల్‌లో పేలుడు.. ఆరుగురి దుర్మరణం, 53 మందికి గాయాలు! ఉగ్రవాద సంకేతాలు: టర్కీ అధ్యక్షుడు
కాగా, టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లో ఆదివారం సాయంత్రం భారీ పేలుడు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. నిత్యం పర్యాటకులు స్థానికులతో రద్దీగా ఉండే బెయోగ్లూ జిల్లాలోని ఇస్తిక్ లాల్ షాపింగ్ స్ట్రీట్ లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నిన్నటి లెక్కల ప్రకారం 53 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. పేలుడు జరిగిన క్రమంలో ఆ ప్రాంతంలోని ప్రజలు భయంతో పరుగులు పెడుతున్న వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక, ఆరోగ్య విభాగం, ఏఎఫ్ డీ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
పేలుడు జరిగిన క్రమంలో ఆ ప్రాంతంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. నగరంలో హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. సైరన్ మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. అయితే, పేలుడుకు గల కారణాలను అధికారులు వెల్లడించలేదు. రెండో పేలుడు జరుగుతుందనే అనుమానంతో ఆ ప్రాంతాన్ని మూసివేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. ప్రవేశ మార్గంలో భారీగా బలగాలను మోహరించినట్లు వెల్లడించింది. ‘ఘటనా స్థలానికి నేను 50-55 మీటర్ల దూరంలోనే ఉన్నాను. ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వచ్చింది. ముగ్గురు నలుగురు పడిపోయి కనిపించారు.
భయంతో అక్కడివారంతా పరుగులు పెట్టారు. నల్లటి పొగ కమ్ముకుంది.. శబ్దం చెవులు పగిలిపోయేలా భారీగా వచ్చింది’ అని ప్రత్యక్షసాక్షి, 57 ఏళ్ల కెమాల్ డెనిజ్కి తెలిపారు. ఇస్తిక్ లాల్ షాపింగ్ స్ట్రీట్ లో ఆదివారం భారీగా జనం ఉంటారు. ఈ క్రమంలో పేలుడు జరగడం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 2015-16లో ఇస్తిక్ లాల్ స్ట్రీట్ లో పేలుడు జరిగి సుమారు 500మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.
