అంకారా:టూరిజానికి పేరొందిన టర్కీలో తీవ్రమైన దుర్భిక్షమైన పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. అతి తక్కువ వర్షపాతం కారణంగా  ఈ పరిస్థితులు నెలకొననున్నాయని నిపుణులు చెబుతున్నారు.

నీటితో కళకళలాడే ఇస్తాంబుల్ ఏడారిగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.రాబోయే 45 రోజుల్లో టర్కీ దేశంలలోని నదులు, జలాశయాలు, డ్యామ్  లు కూడ ఎండిపోయే అవకాశం ఉందని చెప్పారు. టర్కీలోని ప్రధాన నగరాల్లో వచ్చే కొన్ని నెలల్లో నీళ్లు లేక ఎడారిని తలపించనున్నాయి.

దేశంలో చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. దశాబ్దకాలంలో అతి తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో 17 మిలియన్ల టర్కీ ప్రజలు నీటి కొరతను ఎదుర్కోనున్నారు.జనవరి నెల నుండి మరో 110 రోజుల్లో అక్కడి డ్యామ్ లు, రిజర్వాయర్లలో నీరు కూడ ఎండిపోయే పరిస్థితి నెలకొందని నిపుణులు చెబుతున్నారు.2020 లో టర్కీలో కనీసం 50 శాతం వర్షం కూడ నమోదు కాలేదు. దేశంలోని ఇజ్మిర్, బ్యూర్సాలోని డ్యామ్ ల్లో దాదాపుగా 30 శాతానికి నీళ్లు లేకుండా పోయాయి. నీటి వసతి లేక రైతులు విలవిలలాడుతున్నారు.