గాజా మునపటి స్థితికి ఎప్పటికీ తిరిగి రాలేదు.. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు..
ఇజ్రాయెల్-హమాస్‌ల యుద్దంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే తాజాగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. గాజా అది ఉన్న స్థితికి ఎప్పటికీ తిరిగి రాలేదని అన్నారు.
ఇజ్రాయెల్-హమాస్‌ల యుద్దంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్ ఒక్కసారి రాకెట్ల వర్షం కురిపించడం.. ఆ తర్వాత ఇజ్రాయెల్ ఎదురుదాడికి దిగడంతో యుద్దం ప్రారంభమైంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ మిలిటెంట్స్ మధ్య యుద్దం హోరాహోరీగా సాగుతుంది. హమాస్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని.. యుద్దంలో విజయం తమదేనని ఇజ్రాయెల్ చెబుతోంది. అయితే తాజాగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. గాజా గతంలో ఉన్న స్థితికి ఎప్పటికీ తిరిగి రాలేదని అన్నారు.
యోవ్ గాలంట్.. గాజా స్ట్రిప్‌తో ఇజ్రాయెల్ సరిహద్దులో ఫ్రంట్ లైన్‌ను మంగళవారం తనిఖీ నిర్వహించారు. గాజా సరిహద్దు వెంబడి మోహరించిన సైనికులను ఉద్దేశించి గాలంట్ మాట్లాడుతూ.. ఉగ్రదాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ఎదురుదాడి చేస్తుందని, హమాస్ లక్ష్యాలపై పూర్తి స్థాయిలో కదులుతున్నట్లు చెప్పారు. ‘‘నేను అన్ని పరిమితులను విడుదల చేసాను. మేము ఆ ప్రాంతంపై [తిరిగి] నియంత్రణ సాధించాము. మేము పూర్తి నేరానికి వెళుతున్నాము’’ అని చెప్పారు. ఎవరైనా శిరచ్ఛేదం చేయడానికి, మహిళలను హత్య చేయడానికి చూస్తే.. మేము మా పూర్తి శక్తితో, ఎటువంటి రాజీ లేకుండా వారిని నిర్మూలిస్తామని చెప్పారు.
గాజా అది గతంలో ఉన్న స్థితికి ఎప్పటికీ తిరిగి రాలేదని అన్నారు. హమాస్‌ను ‘‘ఐసిస్ ఆఫ్ గాజా’’ అని పిలిచారు. ‘‘హమాస్ గాజాలో మార్పును కోరుకున్నారు. అది వారు అనుకున్నదానికంటే 180 డిగ్రీలు మారుతుంది. వారు ఈ క్షణం పశ్చాత్తాపపడతారు’’ అని యోవ్ గాలంట్ అన్నారు. ఇక, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ఉన్నత అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి మాట్లాడుతూ.. సీనియర్ హమాస్ సభ్యులను హతమార్చడం తమ అత్యంత ప్రాధాన్యత అని చెప్పారు.