ఇజ్రాయెల్-పాలస్తీనా సంక్షోభం.. ఆకస్మిక రాకెట్ల దాడిలో 400 మందికి పైగా మృతి
ఇజ్రాయెల్ పై పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ జరిపిన ఆకస్మిక దాడి వల్ల తీవ్ర ప్రాణ నష్టం సంభవించింది. ఈ దాడి వల్ల
మధ్య నెలకొన్ని ఉద్రిక్త 400 మందికి పైగా మరణించారు. 232 మందికి పైగా చనిపోగా.. ఇజ్రాయెల్ లో 200 మంది మృతి చెందారు.
ఇజ్రాయెల్-పాలస్తీనాల మధ్య నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితుల వల్ల తీవ్ర ప్రాణ నష్టం జరుగుతోంది. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ భూ-వాయి-సముద్ర మార్గంలో జరిపిన దాడి వల్ల ఇప్పటి వరకు 400 మందికి పైగా మృతి చెందారని ‘ఎన్డీటీవీ’ నివేదించింది. ఉగ్రవాద సంస్థ హమాస్ ఆకస్మిక దాడిలో 5,000 రాకెట్ల వల్ల ఈ దాడి వల్ల గాజాలో 232 మందికి పైగా మరణించగా, ఇజ్రాయెల్ లో 200 మంది చనిపోయారు. అయితే దీనికి ఇజ్రాయెల్ ధీటుగా స్పందించింది. హమాస్ పై యుద్ధం ప్రకటించింది. భీకర దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసి వైమానిక దాడులను ప్రారంభించింది.
తెలంగాణ ప్రభుత్వం మరో సరికొత్త పథకం.. ఈసారి ఏకంగా రూ.30 లక్షలు..!
దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. తమ దేశం యుద్ధంలో ఉందని, హమాస్ ఊహించని మూల్యం చెల్లించుకుంటుందని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘ఇజ్రాయెల్ పౌరులారా, మేం యుద్ధంలో ఉన్నాం. ఇది ఆపరేషన్ కాదు, విస్తరణ కాదు. ఇది యుద్ధం. మనం గెలుస్తాం. హమాస్ కనీవినీ ఎరుగని మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ లో పండుగ రోజు ఉదయం ఆకస్మాత్తుగా 5 వేలకు పైగా రాకెట్లు ఆకాశంలోకి ఆ దేశ భూభాగంలోకి చొచ్చుకొచ్చాయి. ఉగ్రవాదులుగా భావించే హమాస్ మిలిటెంట్లు చొరబడ్డారని ఆ దేశ రక్షణ ఇజ్రాయెల్ దళాలు ఆరోపించాయి. ఈ దాడిలో పారాగ్లైడర్లను ఉపయోగించారని, రోడ్లపై వెళ్తున్న కార్లపై కాల్పులు జరిపారని పలు వీడియోలను బాధిత దేశం విడుదల చేసింది.
ఇజ్రాయెల్ పై యుద్ధం ప్రారంభించి హమాస్ ఘోర తప్పిదం చేసిందని రక్షణ మంత్రి యోవ్ గాలెంట్ అన్నారు.‘‘హమాస్ ఈ రోజు ఉదయం ఘోర తప్పిదం చేసి ఇజ్రాయెల్ దేశంపై యుద్ధం ప్రారంభించింది. ఐడీఎఫ్ దళాలు (ఇజ్రాయెల్ సైన్యం) ప్రతి చోటా శత్రువుతో పోరాడుతున్నాయి’’ అని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. గాజా నుంచి ఇజ్రాయెల్ భూభాగంలోకి విస్తృతంగా రాకెట్ దాడులు జరిగాయని, ఉగ్రవాదులు వివిధ ఎంట్రీ పాయింట్ల ద్వారా ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడ్డారని ఆ దేశ సైన్యం తెలిపింది.
హమాస్ సాయుధ విభాగం "ఆపరేషన్ అల్-అక్సా ఫ్లడ్" ను ప్రారంభించినట్లు ప్రకటించింది. 20 నిమిషాల మొదటి దాడిలో 5,000 రాకెట్లను ప్రయోగించింది. ‘‘జవాబుదారీతనం లేని నిర్లక్ష్య కాలం ముగిసిందని శత్రువు అర్థం చేసుకునేలా దేవుడి సహాయంతో వీటన్నింటికీ ముగింపు పలకాలని నిర్ణయించాం’’ అని హమాస్ మిలిటెంట్ లీడర్ మొహమ్మద్ డీఫ్ రికార్డు చేసిన సందేశంలో పేర్కొన్నారు.
వరుస భూకంపాలతో వణికిపోయిన ఆఫ్ఘనిస్తాన్.. 320 మంది మృతి..500మందికి పైగా గాయాలు!
కాగా.. ఈ దాడి వల్ల జెరూసలెం, ఇజ్రాయెల్ అంతటా సైరన్లు మోగాయి. అలాగే దక్షిణ, మధ్య ప్రాంతాల్లో పలు చోట్ల సైరన్లు మోగాయి. పౌరులు షెల్టర్ల దగ్గర, గాజా స్ట్రిప్ సమీపంలో ఉన్నవారు ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం కోరింది. ఇదిలా ఉండగా.. 2007లో గాజాలో హమాస్ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్లు మధ్య దాడులు జరిగాయి. అయితే గాజాన్ కార్మికుల కోసం ఇజ్రాయెల్ తన సరిహద్దులను మూసివేయంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన ఘర్షణల్లో 247 మంది పాలస్తీనియన్లు, 32 మంది ఇజ్రాయెలీలు, ఇద్దరు విదేశీయులు మరణించారు. వీరిలో ఫైటర్లు, పౌరులు కూడా ఉన్నారు.