Israel-Palestine Conflict: వేల సంఖ్యలో మరణాలు.. గాజాలో 260,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు: ఐరాస
Geneva: ఇజ్రాయెల్, గాజా స్ట్రిప్ లలో క్షిపణుల వర్షం కురుస్తున్నాయి. ఇరు ప్రాంతాల మధ్య ఘర్షణలు ఐదో రోజుకు చేరుకోవడంతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గత వారాంతంలో పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ నుంచి క్రూరమైన బహుముఖ దాడి తరువాత ప్రతిస్పందనగా గాజా స్ట్రిప్ సమీపంలో సైన్యాన్ని సమీకరించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
Israel-Palestine Conflict: హమాస్-ఇజ్రాయెల్ వార్ కారణంగా గాజా స్ట్రిప్ లో 2,60,000 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోవాల్సి వచ్చిందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. హమాస్ శనివారం ఆకస్మిక దాడి ప్రారంభించినప్పటి నుండి రెండు వైపులా భీకర పోరులో వేలాది మంది మరణించారు. ఈ దాడి ఇజ్రాయెల్ ప్రతీకార బాంబు దాడిని ప్రేరేపించింది. గాజాలో 2,63,934 మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోయారని భావిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి మానవతా సంస్థ ఓసీహెచ్ఏ ఒక ప్రకటనలో తెలిపింది. శనివారానికి ముందు దాదాపు 3,000 మంది ప్రజలు మునుపటి విస్తరణల కారణంగా నిర్వాసితులయ్యారని తెలిపింది. ఇజ్రాయెల్ లో 75 ఏళ్ల చరిత్రలోనే అత్యంత దారుణమైన దాడిలో 1,000 మందికి పైగా మరణించగా, వైమానిక దాడులు ప్రారంభమైనప్పటి నుంచి 900 మంది మరణించినట్లు గాజా అధికారులు ప్రకటించారు.
బాంబు దాడిలో 1,000కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయనీ, 560 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని పాలస్తీనా అధికారులను ఉటంకిస్తూ ఓసీహెచ్ఏ తెలిపింది. నిర్వాసితుల్లో దాదాపు 1,75,500 మంది పాలస్తీనా శరణార్థులకు మద్దతు ఇచ్చే ఐక్యరాజ్యసమితి సంస్థ యూఎన్ఆర్డబ్ల్యూఏ నిర్వహిస్తున్న 88 పాఠశాలల్లో ఆశ్రయం పొందారు. మరో 14,500 మందికి పైగా 12 ప్రభుత్వ పాఠశాలలకు పారిపోగా, దాదాపు 74,000 మంది బంధువులు, ఇరుగుపొరుగు వారితో కలిసి ఉంటున్నారనీ, అలాగే, చర్చిలు, ఇతర సౌకర్యాల్లో ఆశ్రయం పొందుతున్నారని అంచనా వేసింది. నిర్వాసితులు కాని వారికి ప్రాథమిక అవసరాలు తీర్చడం సవాలుగా మారుతోందని ఓసీహెచ్ ఏ హెచ్చరించింది.
ఇజ్రాయెల్, గాజా స్ట్రిప్ లలో క్షిపణుల వర్షం కురుస్తున్నాయి. ఇరు ప్రాంతాల మధ్య ఘర్షణలు ఐదో రోజుకు చేరుకోవడంతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గత వారాంతంలో పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ నుంచి క్రూరమైన బహుముఖ దాడి తరువాత ప్రతిస్పందనగా గాజా స్ట్రిప్ సమీపంలో సైన్యాన్ని సమీకరించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అప్పటి నుండి ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ ను పూర్తిగా ముట్టడించాలని ఆదేశించింది. ఈ ప్రాంతానికి, అక్కడి 2 మిలియన్లకు పైగా నివాసితులకు నీరు, ఇంధనం, విద్యుత్, ఆహార సరఫరాలను నిలిపివేసింది. అయితే, ఈ చర్య ఇప్పటికే తీవ్రమైన మానవతా పరిస్థితిని మరింత దిగజార్చుతుందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ హెచ్చరించారు.