మిరాకిల్: యాక్సిడెంట్ తర్వాత బాలుడి తలను తిరిగి అతికించిన ఇజ్రాయెల్ డాక్టర్లు

ఇజ్రాయెల్ వైద్యులు అద్భుతం చేశారు. దాదాపుగా మొండెంతో తెగిపోయిన తలను మళ్లీ అతికించారు. 12 ఏళ్ల బాలుడి ప్రాణాలు నిలిపారు.
 

israel doctors reattaches minor boys head after injured in a car accident kms

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌లో వైద్యులు ఒక మిరాకిల్‌ను చేసి చూపించారు. ఓ కారు యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన, మరణం అంచుల్లో ఉన్న 12 ఏళ్ల బాలుడి తలను తిరిగి అటాచ్ చేశారు. ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇందుకు సంబంధించి సంచలన కథనం రిపోర్ట్ చేసింది.

సులేమన్ హసన్ అనే బాలుడు సైకిల్ పై వెళ్లుతుండగా కారు ప్రమాదానికి గురయ్యాడు. అంతర్గతంగా మొండెంతో ఆయన తల తెగిపోయింది. అంటే.. బాలుడి పుర్రె దేహంతో ముఖ్యంగా వెన్నెముకతో విడిపోయింది. దీన్ని వైద్యపరిభాషలో బైలేటరల్ అట్లాంటో ఆక్సిపిటల్ జాయింట్ డిస్‌లొకేషన్ అంటారు. కారు ప్రమాదం తర్వాత బాలుడిని హదస్సా మెడికల్ సెంటర్‌కు వెంటనే ఫ్లైట్‌లో తీసుకువచ్చారు. అక్కడ వైద్యులు ఎమర్జెన్సీ సర్జరీ చేశారు. 

వైద్యుల ప్రకారం, దాదాపు ఆయన తల మెడ బేస్ నుంచి దాదాపుగా వేరైపోయింది. అర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఒహద్ ఎయినవ్ టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్‌తో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సర్జరీ కొన్ని గంటలపాటు సాగిందని వివరించారు. కొన్ని కొత్త ప్లేట్లు, ఫిక్సేషన్లను డ్యామేజ్ జరిగిన చోట చేర్చాల్సి వచ్చిందని తెలిపారు. ఈ ఆపరేషన్ చేసే సామర్థ్యం తమకు ఉండటం, అలాగే.. ఆపరేషన్ రూమ్‌లో అత్యాధునిక పరికరాలు, సౌకర్యాలు ఉండటంతో ఇది సాధ్యమైందని అన్నారు. ఆ బాలుడు బతికే చాన్స్ కేవలం 50 శాతమే ఉండేదని, ఇప్పుడు ఆ బాలుడు సజీవంగా తిరిగి రావడమంటే మిరాకిల్‌ అనే చెప్పాలని వివరించారు.

Also Read: Chandrayaan - 3 : ఇస్రో చేపడుతున్న చంద్రయాన్ మిషన్ అంతిమ లక్ష్యం ఏమిటీ?.. జాబిల్లిపై జీవించ వచ్చా?

ఈ సర్జరీ గత నెలలో జరిగింది. కానీ, వైద్యులు ఈ విషయాన్ని గోప్యంగానే ఉంచారు. జులైలో బయటకు వెల్లడించారు. హాసన్ ఇటీవలే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అయితే, ఆయన పూర్తిగా సాధారణ స్థితికి చేరే వరకు పర్యవేక్షిస్తూనే ఉంటామని వైద్యులు చెప్పారు. ఆపరేషన్ తర్వాత ఆ బాలుడికి ఎలాంటి న్యూరోలాజికల్, సెన్సరీ, మోటార్ డిస్‌ఫంక్షన్ వంటి సమస్యలేవీ కనిపించలేవని పేర్కొన్నారు. ఆయన సాధారణ మనిషిగా కోలుకున్నాడని, స్వయంగా నడుచుకుంటూ వెళ్లాడని, ఇది చిన్న విషయమేమీ కాదని డాక్టర్ ఎయినవ్ వివరించారు.

ఇది సాధారణ సర్జరీ కాదని, ముఖ్యంగా పిల్లలు, టీన్స్‌లకు అత్యంత క్లిష్టమై నదని ఆయన చెప్పారు. బాలుడి తండ్రి ఒక్క క్షణం అతడిని విడిచి ఉండలేదు. తన ఏకైక పుత్రుడిని కాపాడిన హాస్పిటల్ సిబ్బందికి ఆయన ధన్యవాదాలు చెప్పారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios