లెబనాన్ పై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ ... 100 మంది మృతి, 400 మందికి గాయాలు 

లెబనాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి.  తాజాగా మారణహోమం చోటుచేసుకుందని లెబనాన్ అధికారులు వెల్లడించారు. 

Israel Airstrike on Lebanon: Over 100 Dead, 400 Injured in Devastating Attack AKP

ఇజ్రాయోల్ దళాల వైమానిక దాడిలో లెబనాన్ అల్లకల్లోలంగా మారింది. ఈ దాడిలో ఇప్పటికే 100 మందికి పైగా మృతిచెందగా మరో 400 మంది గాయాలపాలయ్యారని లెబనాన్ అధికారులు ప్రకటించారు. గాయపడిన వారిలో చాలామంది ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ ఎయిర్ స్ట్రైక్ వల్ల చాలామంది నిరాశ్రయులు అయ్యారని లెబనాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

ఇక లెబనాన్ లో వైమానిక దాడులపై ఇజ్రాయెల్ కూడా స్పందించింది.  హెజ్బుల్లా గ్రూప్ కు చెందిన 300 కు పైగా స్థావరాలపై దాడులు చేసినట్లు ప్రకటించారు. ఈ దాడులు దక్షిణ లెబనాన్ లో జరిగాయి. దాడులకు ముందు హెజ్బుల్లా ఆయుధాలు నిల్వ చేసిన స్థావరాలు,  చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వెంటనే ఖాళీచేసి వెళ్లిపోవాలంటూ హెచ్చరించినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది.  

ఇక గతవారం లెబనాన్ రాజధాని బీరుట్ లో ఓ భవనంపై దాడిచేసింది ఇజ్రాయెల్. హెజ్బుల్లా గ్రూప్ కు చెందిన కీలక సభ్యులు సమావేశం కాగా.... సమాచారం అందుకున్న ఇజ్రాయెల్ సైన్యం ఒక్కసారిగా దాడికి దిగింది. ఇందులో 16 మంది హెజ్బుల్లా కమాండర్లు మృతిచెందారు. ఈ దాడిలో హెజ్బుల్లా తీవ్రంగా గాయపడింది. అంతకుముందు పేజర్లు, వాకీటాకీల పేలుళ్లు కలకలం రేపింది. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios