Asianet News TeluguAsianet News Telugu

ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ హసన్ ఖురేషీ మృతి.. కొత్త నాయకుడెవరంటే...

ఇస్లామిక్ స్టేట్ జిహాదిస్ట్ గ్రూప్ తమ కొత్త నాయకుడికి సంబంధించి ఓ వీడియో మెసేజ్ ను రిలీజ్ చేసింది. ఇందులో తమ ప్రస్తుత నాయకుడు మరణించాడని, కొత్త నాయకుడిని ఎన్నుకున్నట్లు ప్రకటించింది. 

ISIS Terror Group leader abu al hassan al Qurayshi Killed In Battle
Author
First Published Dec 1, 2022, 6:53 AM IST

లెబనాన్ : ఇస్లామిక్ స్టేట్ జిహాదిస్ట్ గ్రూప్ బుధవారం తన నాయకుడు అబూ హసన్ అల్-హషిమీ అల్-ఖురాషి యుద్ధంలో చనిపోయాడని, అతని స్థానంలో మరో నాయకుడికి ఎన్నుకున్నట్లు ప్రకటించింది.  ఇరాకీకి చెందిన హషిమీ "దేవుడి శత్రువులతో యుద్ధంలో" చంపబడ్డాడని దాంట్లో తెలిపారు. అయితే, అతను ఎప్పుడు,  ఎక్కడ చనిపోయాడనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఈ మేరకు ఓ ఆడియో మెసేజ్ విడుదల చేశారు. 

ఆడియో మెసేజ్ లో ఓ వ్యక్తి మాట్లాడుతూ, తమ ఉగ్రవాద గ్రూప్  కొత్త నాయకుడు అబూ అల్-హుస్సేన్ అల్-హుస్సేనీ అల్-ఖురాషీ అని చెప్పుకొచ్చాడు. ఖురాషీ అనేది ప్రవక్త మొహమ్మద్ తెగను సూచిస్తుంది, ఐఎస్ నాయకులు తాము ఈ సంతతికి చెందినవారమని నమ్ముతారు. ఇక ఈ మెసేజ్ లో కొత్త నాయకుడి వివరాలు ఏమీ తెలుపలేదు. కానీ, అతను "అనుభవజ్ఞుడైన" జిహాదీ అని, ఐఎస్ కి విధేయులైన అన్ని గ్రూపులు తమ విధేయతను చూపించాలని పిలుపునిచ్చారు.

మదర్సాలో బాంబు పేలుడు.. 15 మంది మృతి.. పలువురు పరిస్థితి విషమం..

ఐఎస్ నాయకుడు అబూ ఇబ్రహీం అల్-ఖురాషి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తర సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్స్‌లో అమెరికా దాడిలో మరణించాడు. అంతకు ముందు నాయకుడు అబూ బకర్ అల్-బాగ్దాదీ కూడా అక్టోబర్ 2019లో ఇడ్లిబ్‌లో చంపబడ్డాడు. ఐస్ మీద పుస్తకాన్ని రచించిన హసన్ హసన్ లో ఓ "అపూర్వమైన" ఘటన ఏమిటంటే.. హషిమి "దాడి సమయంలో లేదా అతనిని ఎవరు చంపారో తెలియకుండా పోరాటంలో 'ప్రమాదవశాత్తు' చంపబడ్డాడు" అనడం.

ఈ ఏడాది అక్టోబర్‌లో, ఈశాన్య సిరియాలో యుఎస్ దళాలు తెల్లవారుజామున జరిపిన దాడిలో "సీనియర్" ఐఎస్ సభ్యుడు హతమయ్యాడని యుఎస్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ ఆ టైంలో తెలిపింది. ఆ తర్వాత జరిగిన వైమానిక దాడిలో మరో ఇద్దరు సీనియర్ ఐఎస్ సభ్యులు మరణించారని పేర్కొంది. సిరియాలో ఐఎస్‌తో పోరాడుతున్న సైనిక కూటమికి అమెరికా నాయకత్వం వహిస్తోంది.

జూలైలో, పెంటగాన్ లోని ఉత్తరాన డ్రోన్ దాడిలో సిరియా అగ్ర ఐఎస్ జిహాదిస్ట్‌ను చంపినట్లు తెలిపింది. యుఎస్ సెంట్రల్ కమాండ్ చనిపోయిన వ్యక్తి ఐస్ ఐదు ముఖ్య నాయకుల్లో ఒకరని తెలిపింది. సెప్టెంబరులో టర్కీ  భద్రతా దళాలు అబూ జైద్ అని పిలవబడే ఐస్ "సీనియర్ ఎగ్జిక్యూటివ్" ను అరెస్టు చేశాయని, అతని అసలు పేరు బషర్ ఖత్తాబ్ గజల్ అల్-సుమైదై అని పేర్కొంది. సుమైదాయ్ ఐఎస్ నాయకుడై ఉండవచ్చని కొన్ని అనుమానాలు ఉన్నాయని టర్కీ మీడియా పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios