ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యం సరిగా లేదని.. ఆయన బ్రెయిన్ డెడ్ అయ్యారంటూ గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలకు చెక్ పడింది.  చాలా రోజుల తర్వాత ఆయన ప్రజల ముందుకు వచ్చారు. ఆయన రాకతో... ఆయన ఆరోగ్యం సరిగాలేదంటూ వార్తలు రాసిన జాతీయ మీడియా సంస్థలన్నింటికీ షాకిచ్చినట్లయ్యింది.


అయితే కిమ్ ఎరువుల కంపెనీ ఓపెనింగ్ కి వచ్చిన వార్త ఆ దేశ అధికారిక మీడియా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) మాత్రమే వెల్లడించింది. ఆ వీడియోలో కిమ్ రాక చూసి ప్రజలంతా ఆశ్చర్య పోతున్నారు. తమ దేశ అధ్యక్షున్ని చూసి ఆ దేశ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

అయితే.. ఈ వార్తను కేవలం కేవలం ఆ దేశ అధికారిక మీడియా సంస్థ తప్ప.. మరే ఇతర న్యూస్ ఏజెన్సీ టెలికాస్ట్ చేయకపోవడం గమనార్హం. జాతీయ మీడియా సంస్థలు కూడా స్పందించలేదు. దీంతో.. ఈ నిజంగా కిమ్ ఆ కార్యక్రమానికి హాజరయ్యాడా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. 

ఇప్పుడు ఈ అనుమానమే నిజమైంది. మొన్న ప్రజల ముందుకు వచ్చింది కిమ్ కాదంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కిమ్‌కు సంబంధించి అంతకుముందు, ఇప్పుడు ఫొటోలను చూపిస్తోన్న చాలా మంది.. తేడాలను చెప్తున్నారు. కిమ్ కళ్లు, పళ్లు, దవడలను చూపిస్తూ.. వచ్చింది కిమ్ కాదని, అతడి డూప్‌ అని చెప్తున్నారు. 

ఇక ప్రముఖ డెయిలీ మెయిల్‌ వెబ్‌సైట్ కూడా ఓ కథనాన్ని ప్రచురించింది. కిమ్‌ జాంగ్‌ ఉన్‌ తన బాడీని డబుల్‌గా వినియోగించాడని అందులో ప్రచురించింది. దీంతో కిమ్‌పై అందరిలో మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. కాగా కిమ్ తండ్రి కిమ్ జాంగ్ ఇల్ విషయంలోనూ అప్పట్లో ఇలాంటి వార్తలే రావడం గమనర్హం.

ఇదిలా ఉండగా.. గత కొద్ది  రోజులుగా కిమ్ ఆరోగ్యం విషమంగా ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఒకసారైతే ఏకంగా కిమ్ చనిపోయాడంటూ కూడా వార్త ట్రెండ్ అయ్యింది. దీనికి కారణం గుండె ఆపరేషన్ తరవాత కిమ్ మీడియా ముందుకు రాకపోవడమే. ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఆయన మళ్లీ కనపడలేదు. దీంతో.. ఆరోగ్యం విషమించిందని.. అందుకే కనపడలేదని వార్తలు పుట్టుకువచ్చాయి.