షెడ్యూల్‌లో మార్పుపై పైలట్ విసుగు చెంది గగనతలంలో వివాదాస్పద ఆకృతిని గీయడం గమనార్హం.
ఓ పైలెట్ కి చిరాకు పుట్టి ఆకాశంలో చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఓ పైలెట్ తన మార్గంలో తాను వెళ్తుండగా, అధికారులు ఆర్డర్లు జారీ చేశారు. వారి ఆర్డర్స్ ప్రకారం అతను తన విమానాన్ని దారి మల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
లుఫ్తాన్స పైలట్ తన విమానాన్ని దారి మళ్లించమని అడిగిన తర్వాత ఆకాశంలో 24 కి.మీ పొడవు పురుషాంగం ఆకారాన్ని సృష్టించాడు. జూలై 28న, పేరు తెలియని పైలట్ వాస్తవానికి ఫ్రాంక్‌ఫర్ట్ నుండి సిసిలీకి వెళ్లాల్సి ఉంది. అయితే, ఫోంటనారోస్సా విమానాశ్రయంలో కార్యకలాపాలు తగ్గిన కారణంగా మాల్టాలో దిగవలసిందిగా అతనికి సూచించారు. షెడ్యూల్‌లో మార్పుపై పైలట్ విసుగు చెంది గగనతలంలో వివాదాస్పద ఆకృతిని గీయడం గమనార్హం.
జూలైలో సంభవించిన టెర్మినల్ అగ్ని ప్రమాదం కారణంగా ఫ్రాంక్‌ఫర్ట్ నుండి ఇన్‌బౌండ్ విమానం ఫోంటనారోస్సా విమానాశ్రయంలో ల్యాండ్ కాలేదని సమాచారం. మాల్టా వైపు తన మార్గాన్ని మళ్లించమని కోరినప్పుడు విమానం తూర్పు వైపు సిసిలియన్ తీరం వైపు వెళ్లింది.
ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఆపివేయడంపై పైలట్ రెచ్చిపోయాడని న్యూయార్క్ పోస్ట్ లో పేర్కొన్నారు. పర్యవసానంగా, విమానం మాల్టా వైపు వెళుతుండగా ప్రమాదవశాత్తూ పురుష జననేంద్రియాల ఆకృతిలో ఎగిరింది. పైలట్ విమానాన్ని తిరిగి సిసిలీ మీదుగా, దక్షిణం వైపు మాల్టా వైపు మళ్లించాడు. అతను అలా మల్లించడానికి దాదాపు 16 నిమిషాలు పట్టడం గమనార్హం.
అయితే, అలా ఎందుకు చేశారు అని అధికారులు ఆ పైలెట్ ప్రశ్నించారట. దానికి అతను కావాలని చేయలేదని, గాలిలో ఆకస్మిక మార్పు కారణంగా దారి మళ్లించారని పేర్కొనడం గమనార్హం.
