స్వతంత్ర దేశంగా పాలస్తినా... : ఐర్లాండ్, నార్వే. స్పెయిన్ ప్రకటన
ఇజ్రాయెల్, హమాస్ యుద్ద సమయంలో ప్రపంచ దేశాలు కీలక నిర్ణయం తీసుకుంటున్నాయి. తాజాగా స్నెయిన్ తో పాటు నార్వే,ఐర్లాండ్ కీలక ప్రకటన చేసాయి.
పాలస్తినాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నట్లు ఐర్లాండ్, నార్వే మరియు స్పెయిన్ దేశాలు ప్రకటించాయి. ఈ మేరకు ఈ మూడు దేశాలు అధికారిక ప్రకటన కూడా చేసాయి. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్ ఐర్లాండ్, నార్వే దేశాల్లోని తమ రాయబారులను వెనక్కి పిలిపించింది. అలాగే స్పెయిన్ విషయంలోనే ఇలాంటి నిర్ణయమే తీసుకునే ఆలోచనలో వుంది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ద సమయంలో పాలస్తీనా విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాయి ఐర్లాండ్, నార్వే, స్పెయిన్. ఈ సందర్భంగా ఐరిష్ ప్రధాన మంత్రి సైమన్ హారిస్ మాట్లాడుతూ... పాలస్తినాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నామని అన్నారు. తమ నిర్ణయానికి కట్టుబడి వుంటామని... ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని ఐరిష్ ప్రధాని తెలిపారు. మిగతా దేశాలు కూడా పాలస్తినాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తాయన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేసారు.
ఇక స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచేజ్ మాట్లాడుతూ.... పాలస్తినా విషయంలో తాము తీసుకున్న నిర్ణయం మే 28 నుండి అమల్లోకి వస్తుందన్నారు. అప్పటినుండి పాలస్తినా స్వతంత్ర దేశంగా పరిగణిస్తామని అన్నారు.