Tehran: డొనాల్డ్‌ ట్రంప్‌ ను చంపెస్తామ‌నే ఇరాన్ ప్ర‌క‌ట‌న క‌ల‌కలం రేపుతోంది. ఇరాన్ 1,650 కిలోమీటర్ల (1,025 మైళ్ళు) పరిధి గల క్రూయిజ్ క్షిపణిని అభివృద్ధి చేసిందని రివల్యూషనరీ గార్డ్స్ టాప్ కమాండర్ చెప్పారు. ఇది పాశ్చాత్య ఆందోళనలను లేవనెత్తే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. 

Iran Threat To Kill Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను చంపేస్తామ‌ని ఇరాన్ హెచ్చ‌రించింది. ఇప్ప‌టికే అమెరికా స‌హా ప‌లు దేశాలు ఇరాన్ పై ఆంక్ష‌లు విధించాయి. అయిన‌ప్ప‌టికీ వెన‌క్కి త‌గ్గ‌కుండా త‌న ఆయుధ సంప‌త్తిని పెంచుకోవ‌డ‌నికి త‌న ముందున్న అన్ని అవ‌కాశాల‌ను వాడుకుంటోంది ఇరాన్. తాజాగా మ‌రో లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిప‌ణిని అభివృద్ది చేశామ‌నీ, ఇది పాశ్యాత్య ఆందోళ‌ల‌ను లేవ‌నెత్తే అవ‌కాశముంద‌ని కూడా పేర్కొంది. 

వివ‌రాల్లోకెళ్తే.. అగ్రరాజ్యంపై ప్రతీకారం తీర్చుకుంటామని పేర్కొంటూ ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను అంతమొందిస్తామంటూ ఇరాన్ క‌మాండ‌ర్ హెచ్చ‌రించారు. ఆయ‌న చేసిన ఈ వ్యాఖ్య‌లు అంత‌ర్జాతీయంగా తీవ్ర చ‌ర్చ‌కు తెర‌లేపాయి. ఇరాన్ 1,650 కిలోమీటర్ల (1,025 మైళ్ళు) పరిధి గల క్రూయిజ్ క్షిపణిని రూపొందించింది. పరీక్షలు పూర్తికావడంతో ఇరాన్ కమాండర్ కీలక ప్రకటన విడుదల చేశారు. నిజానికి ఈ ప్రకటన అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గురించే. ఇప్పుడు ట్రంప్ ను హతమార్చేందుకు ఇరాన్ కుట్రలు పన్నుతోందని ఈ ప్ర‌క‌ట‌న ద్వారా స్ప‌ష్ట‌మైంది. ఎందుకంటే ట్రంప్ ను చంపేస్తామ‌ని ఇరాన్ టాప్ కమాండర్ స్వయంగా చెప్పారు.

ట్రంప్ ను ఇరాన్ ఎందుకు టార్గెట్ చేసింది..? 

శుక్రవారం (ఫిబ్రవరి 24) ఇరాన్ టాప్ కమాండర్ అమిరాలీ హజీజాదే మాట్లాడుతూ.. డొనాల్డ్ ట్రంప్ ను చంపుతామ‌నీ, తమ‌ కమాండర్ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామ‌ని హెచ్చ‌రించాడు. వాస్తవానికి 2020లో అమెరికా డ్రోన్ దాడిలో అప్పటి ఇరాన్ సైనిక కమాండర్ ఖాసిం సులేమానీ హతమయ్యాడు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా బాలిస్టిక్ క్షిపణితో అమెరికా సైన్యంపై దాడి చేసింది. ఇదే విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావిస్తూ ఇరాన్ టాప్ కమాండర్ ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం మ‌రోసారి అంత‌ర్జాతీయంగా ఉద్రిక్త‌త‌లు పెరిగే అవ‌కాశ‌ముందని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌ళ్లీ ఈ రెండు దేశాలు క్షిప‌ణుల దాడులు చేసుకోవ‌డం మొద‌లు పెడితే ప‌రిస్థితులు దారుణంగా మారే అవ‌కాశాలు ఉన్నాయి. 

ఇరాన్ టాప్ కమాండర్ అమిరాలీ హజీజాదే ఏం చెప్పారంటే..? 

ఉక్రెయిన్ యుద్ధంలో ఇరాన్ డ్రోన్లను రష్యా ఉపయోగించిన తరువాత పాశ్చాత్య ఆందోళనలను లేవనెత్తే చర్యలో ఇరాన్ 1,650 కిలోమీటర్ల (1,025 మైళ్ళు) పరిధితో క్రూయిజ్ క్షిపణిని అభివృద్ధి చేసిందని రివల్యూషనరీ గార్డ్స్ ఉన్నతాధికారి తెలిపారు. ఇరాన్ అగ్రశ్రేణి కమాండర్ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ పదేపదే బెదిరించడం గురించి అమిరాలీ హజీజాదే మాట్లాడుతూ.. "మేము అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను చంపాలని చూస్తున్నామని" తెలిపారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ క్షిపణి ఆయుధ సంపత్తిలో 1,650 కిలోమీటర్ల పరిధి గల క్రూయిజ్ క్షిపణిని చేర్చినట్లు వెల్ల‌డించారు. కొత్త పావే క్రూయిజ్ క్షిపణిని చూపించే మొదటి ఫుటేజీని ఇరాన్ ప్ర‌భుత్వ టెలివిజన్ ప్రసారం చేసింది.

2020లో బాగ్దాద్ లో అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ సైనిక కమాండర్ ఖాసిం సులేమానీ మరణించిన కొన్ని రోజుల తర్వాత ఇరాక్ లో అమెరికా నేతృత్వంలోని దళాలపై బాలిస్టిక్ క్షిపణి దాడి చేసినప్పుడు ఇరాన్ అమాయ‌క సైనికులను చంపాలనే ఉద్దేశం లేదని హజీజాదే అన్నారు. "దేవుడి దయతో ట్రంప్ ను చంపాలని చూస్తున్నాం. సులేమానీని హతమార్చాలని ఆదేశాలు జారీ చేసిన సైనిక కమాండర్ (మాజీ విదేశాంగ మంత్రి మైక్) పాంపియోను సైతం హ‌త‌మారుస్తాం" అంటూ హెచ్చ‌రించారు.