Asianet News TeluguAsianet News Telugu

కుప్పకూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్… ప్రమాదంపై పలు అనుమానాలు..!

Iran President Ebrahim Raisi Helicopter Crash: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం (మే 19) ప్రమాదానికి గురైంది. ఇరాన్ స్టేట్ టెలివిజన్ ప్రకారం.. అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ అజర్‌బైజాన్ సరిహద్దు సమీపంలో కూలిపోయింది. అయితే ఇరాన్ అధ్యక్షుడిని ఇంకా గుర్తించలేదు.

Iran President Ebrahim Raisi Helicopter Crash on Tabriz Azerbaijan Border know latest big updates for Incident KRJ
Author
First Published May 20, 2024, 8:18 AM IST

Ebrahim Raisi Helicopter Crash: ఇరాన్ అద్యక్షుడు ఇబ్రహీం రయీసీ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. అజర్ బైజాన్ పర్యటన ముగించుకొని ఇరాన్ తిరిగి వస్తుండగా ప్రావిన్స్ లోని జోల్ఫా సమీపంలోని మంచు పర్వతాల వద్ద హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో రయీసీతోపాటు విదేశాంగ మంత్రి కూడా ఉన్నారు.ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అజర్‌బైజాన్ సరిహద్దులోని డ్యామ్‌ను ప్రారంభించి ఇరాన్ కు తిరిగి వస్తుండగా హెలికాప్టర్ కుప్పకూలింది.

దేశానికి ఉత్తరాన ఉన్న తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లో అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్ హార్డ్ ల్యాండింగ్ అయిందని ఇరాన్ మీడియా నివేదించింది. ఈ ప్రమాదం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు వాయువ్యంగా 600 కిలోమీటర్ల దూరంలో అజర్‌బైజాన్ సరిహద్దుకు సమీపంలో జరిగిందని భావిస్తున్నారు. ఇరాన్ మీడియా ప్రకారం.. ప్రెసిడెంట్ రైసీతో కలిసి హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న వారిలో సెయ్యద్ మొహమ్మద్-అలీ అల్-హషేమ్, తబ్రిజ్‌కు చెందిన జుమా , జమాత్ మరియు విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్దొల్లాహియాన్ , ఇతరులు ఉన్నట్టు వెల్లడించింది. 

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఆర్మీ, రెస్క్యూ సిబ్బందిని సంఘటనా స్థలానికి ప్రయత్నించాయి. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా రెస్క్యూ టీమ్ చేరుకోలేకపోయింది. దీంతో ప్రెసిడెంట్ రైసీ ఆచూకీ కోసం సైన్యం డ్రోన్ల సహాయంతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. కానీ, రాత్రంతా సెర్చ్ ఆపరేషన్ జరిగిన ఫలితం లేకుండా పోయింది. ప్రతికూల వాతావరణం కారణంగా ఇబ్రహీం రయీసీ హెలికాప్టర్ ప్రమాదానికి గురి అయినట్లుగా వెల్లడించాయి. దట్టమైన పొగ మంచు కారణంగా హెలికాప్టర్ ప్రమాదానికి గురి కావడంతో ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.

ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేస్తూ.. మేము కష్టమైన, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాము. అధ్యక్షుడు హెలికాప్టర్ గురించి ఇంకా ఎలాంటి వార్త రాలేదు. శాంతిభద్రతలు కాపాడాలని, ప్రార్థనలు చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. ప్రెసిడెంట్ రైసీ హెలికాప్టర్‌తో పాటు మరో రెండు హెలికాప్టర్లు ఉన్నాయి. వాటికి ఎలాంటి నష్టం జరగకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తరువాత అధ్యక్షుడు ? 

ఈ ప్రమాదంలో అధ్యక్షుడికి ఏదైనా జరిగితే ఆయన స్థానంలో వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ మోఖ్‌బర్‌ను నియమిస్తారని ఇరాన్ మీడియా చెబుతోంది. దీని తర్వాత మరో 50 రోజుల్లో కొత్త ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. హెలికాప్టర్ ప్రమాదం తర్వాత ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ ఉన్నత స్థాయి సమావేశాన్ని పిలిచారు. అతను ప్రెసిడెంట్ రైసీ కోసం కూడా ప్రార్థించాడు. ఇరాన్ ప్రజలు ఆందోళన చెందవద్దని, ఈ ప్రమాదం వల్ల ప్రభుత్వ పనికి ఎలాంటి నష్టం వాటిల్లదని అన్నారు.

ప్రధాని మోడీ ఆందోళన

మరోవైపు ప్రమాదంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రెసిడెంట్ రైసీ హెలికాప్టర్‌కు సంబంధించి నేడు వచ్చిన నివేదికల పట్ల తాను చాలా ఆందోళన చెందుతున్నానని ఆయన అన్నారు. ఈ సంక్షోభ సమయంలో మేము ఇరాన్ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తాము. అధ్యక్షుడు, అతని సహచరుల శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నామని పేర్కొన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios