Iran President Helicopter Crash: హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు దుర్మరణం.. ప్రధాని మోడీ సంతాపం

Iran President Ebrahim Raisi Helicopter Crash: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్డొల్లాహియాన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నిన్ని పర్వాతాల్లో కుప్పకూలిపోయింది. ఈ హెలికాప్టర్ ప్రమాదంలో వారు మరణించారు. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. 

Iran President Ebrahim Raisi Helicopter Crash  How Khamenei, PM Modi, World Leaders Reacted KRJ

Iran President Ebrahim Raisi Helicopter Crash: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అజర్ బైజాన్ పర్యటన ముగించుకొని ఇరాన్ తిరిగి వస్తుండగా ప్రావిన్స్ లోని జోల్ఫా సమీపంలోని మంచు పర్వతాల వద్ద హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇబ్రహీం రైసీతోపాటు విదేశాంగ మంత్రి అమీర్ అబ్దుల్లాహియాన్ కూడా మరణించారని ఇరాన్ మీడియా వెల్లడించింది. ఆదివారం నాడు అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అజర్‌బైజాన్ సరిహద్దులోని డ్యామ్‌ను ప్రారంభించి ఇరాన్ కు తిరిగి వస్తుండగా హెలికాప్టర్ కుప్పకూలింది. ఇరాన్ కు ఉత్తరాన ఉన్న తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లో అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్ కూలిపోయింది.

ఇరాన్ విదేశాంగ మంత్రి అమీర్ అబ్దుల్లాహియాన్ కూడా రైసీ వెంట ఉన్నారు. రెస్క్యూ బృందాలు ప్రమాద స్థలానికి చేరుకున్నాయని ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ అధిపతి తెలిపారు. ఈ ప్రమాదం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు వాయువ్యంగా 600 కిలోమీటర్ల దూరంలో అజర్‌బైజాన్ సరిహద్దుకు సమీపంలో జరిగిందని తెలిపారు. అయితే.. ప్రమాదం ఎలా జరిగిందనే దాని గురించి సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. అయితే రైసీ హెలికాప్టర్ అకస్మాత్తుగా పొగమంచుకు గురైందని నిపుణులు భావిస్తున్నారు.  

హెలికాప్టర్‌లో ఎవరు ఉన్నారు?

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు హెలికాప్టర్‌లో విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్, తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మాలెక్ రహ్మతి, తబ్రిజ్ రాయల్ ఇమామ్ మొహమ్మద్ అలీ అల్హాషెమ్, ఒక పైలట్ కూడా ఉన్నారని ఇరాన్ వార్తా సంస్థ తస్నిమ్ తెలిపింది. సెక్యూరిటీ చీఫ్,ఒక సెక్యూరిటీ గార్డు విమానంలో ఉన్నట్టు సమాచారం. ప్రమాద స్థలంలో ఎవరు కూడా బ్రతికి ఉన్న అనవాళ్లు కనిపించడం లేదని అక్కడి లోకల్ మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి.

ప్రమాదానికి కారణమదేనా?

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంపై విమాన నిపుణుడు కైల్ బెయిలీ మాట్లాడుతూ.. అధ్యక్ష విమానాలను నడిపే పైలట్లు సాధారణంగా నైపుణ్యం,అనుభవజ్ఞులు, అయితే హెలికాప్టర్ చాలా క్లిష్టమైన యంత్రం.  హెలికాప్టర్ గాలిలోకి ఎగిరినప్పుడు, వాతావరణం స్పష్టంగా ఉంటే.. ప్రతిదీ బాగానే ఉంటుంది, కానీ పైలట్లు పర్వతాలు, కఠినమైన, అటవీ ప్రాంతాలలో ప్రయాణించినప్పుడు  సమస్య తలెత్తుతుంది. మీరు ఊహించని ప్రదేశాలలో పొగమంచు అకస్మాత్తుగా దాడి చేయవచ్చు. ఇది వాతావరణ సూచనలపై ఆధారపడి ఉంటుంది. ఇది మ్యాప్‌లలో ఉండదు లేదా రాడార్‌లో కనిపించదు. పొగమంచు ఎక్కడా కనిపించదు, పైలట్‌పై అకస్మాత్తుగా దాడి చేస్తుంది. దీని తర్వాత హెలికాప్టర్‌ను హ్యాండిల్ చేయడం పైలట్‌కు కష్టంగా మారుతుంది" అని బెయిలీ చెప్పారు.

తరువాత అధ్యక్షుడు ? 

ఈ ప్రమాదంలో అధ్యక్షుడికి ఏదైనా జరిగితే ఆయన స్థానంలో వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ మోఖ్‌బర్‌ను నియమిస్తారని ఇరాన్ మీడియా చెబుతోంది. దీని తర్వాత మరో 50 రోజుల్లో కొత్త ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. హెలికాప్టర్ ప్రమాదం తర్వాత ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ ఉన్నత స్థాయి సమావేశాన్ని పిలిచారు. అతను ప్రెసిడెంట్ రైసీ కోసం కూడా ప్రార్థించాడు. ఇరాన్ ప్రజలు ఆందోళన చెందవద్దని, ఈ ప్రమాదం వల్ల ప్రభుత్వ పనికి ఎలాంటి నష్టం వాటిల్లదని అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం 

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. భారత్-ఇరాన్ సంబంధాలను బలోపేతం చేయడంలో ఇబ్రహీం రైసీ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుందని మోదీ అన్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios