Iran President: దేశాధ్య‌క్షుడు మ‌ర‌ణిస్తే.. తదుపరి ఎవరు బాధ్యతలు చేపడుతారు? ఇరాన్ రాజ్యాంగం ఏం చెబుతోంది?

Iran President:  ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రేసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన తర్వాత ఇరాన్‌ బాధ్యతలు ఎవరు చేపడతారనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. రాజ్యాంగం ఏం చెబుతుందో తెలుసుకోండి...

Iran President Ebrahim Raisi dead in helicopter crash: Who will be next President of Iran, what does the Constitution say? KRJ

Iran President: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఇరాన్ రెస్క్యూ టీమ్ రెడ్ క్రెసెంట్ గంటల తరబడి శ్రమించి హెలికాప్టర్ కూలిన ప్రదేశానికి చేరుకుంది. అక్కడ ఎవరూ ప్రాణాలతో లేరని నిర్ధారించింది. ఈ హెలికాప్టర్‌లో ప్రెసిడెంట్ రైసీ, ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్‌తో సహా మొత్తం 9 మంది ఉన్నారు. వారంతా ప్రమాదంలో చనిపోతారని ఇరాన్ మీడియా చెబుతుంది.ఇబ్రహీం రైసీ హఠాన్మరణం తర్వాత .. ఇరాన్‌ బాధ్యతలు ఎవరు చేపడతారనే ప్రశ్న తలెత్తుతోంది. ఇంతకీ ఇరాన్ రాజ్యాంగం ఏం చెబుతోంది?  

ఇరాన్ రాజ్యాంగం ప్రకారం.. సిట్టింగ్ ప్రెసిడెంట్ అకస్మాత్తుగా మరణిస్తే.. ఆర్టికల్ 131 ప్రకారం మొదటి వైస్ ప్రెసిడెంట్ తాత్కాలిక అధ్యక్ష పదవిని అధిష్టించాలని చెబుతుంది. మొదటి ఉపాధ్యక్షుడు గరిష్టంగా 50 రోజుల వరకు ఆ పదవి భాద్యతలు చేపట్టవచ్చు.అయితే..దీని కోసం ఇరాన్ అత్యున్నత నాయకుడు అంటే అయతుల్లా ఖమేనీ ఆమోదం అవసరం.దీని ప్రకారం ఇరాన్ మొదటి ఉపాధ్యక్షుడు మహ్మద్ మొఖ్బర్ తాత్యాలిక అధ్యక్షుడిగా అధికార భాద్యతలు స్వీకరించనున్నారు.

దీని తరువాత.. ఉపరాష్ట్రపతి, పార్లమెంట్ స్పీకర్, న్యాయవ్యవస్థ అధిపతితో కూడిన కౌన్సిల్ గరిష్టంగా 50 రోజుల్లోపు కొత్త రాష్ట్రపతికి ఎన్నికలను ఏర్పాటు చేయాలి. ఇబ్రహీం రైసీ 2021లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు తదుపరి అధ్యక్ష ఎన్నికలు 2025లో జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆయన మరణానంతరం త్వరలో మళ్లీ అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. 

వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మొఖ్బర్ ఎవరు?

ఇరాన్‌లో మొదటి వైస్ ప్రెసిడెంట్ పదవి ఎన్నుకోబడినది కాదు, నియమించబడిన పదవి, అంటే దానికి ఎన్నికలు లేవు. అయితే అధ్యక్షుడే తన సహాయకుడిని నియమిస్తాడు. 2021 ఆగస్ట్‌లో ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే రైసీ మొఖ్‌బర్‌ను మొదటి ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఇరాన్‌లో పలువురు వైస్ ప్రెసిడెంట్‌లు ఒకే సమయంలో నియమితులయ్యారు. వారు ఎక్కువగా క్యాబినెట్ సభ్యులుగా పనిచేస్తారు.  .

ఈ రాజ్యాంగ సవరణ తర్వాత, మొఖ్బర్ మొదటి ఉపరాష్ట్రపతి పదవిని కలిగి ఉన్న ఏడవ వ్యక్తి. వైస్ ప్రెసిడెంట్‌గా నియమించబడటానికి ముందు మొఖ్బర్ 14 సంవత్సరాలు ఇరాన్ సెటాద్‌కు అధిపతిగా పనిచేశాడు. ఇది శక్తివంతమైన ఆర్థిక సమూహంగా పరిగణించబడుతుంది. ఇది ఎక్కువగా మతానికి సంబంధించినది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios