రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ
Russia-Ukraine war: ఉక్రెయిన్ లో జరిగిన యుద్ధ నేరాలకు సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు వ్యతిరేకంగా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలోనే పిల్లలను చట్టవిరుద్ధంగా బహిష్కరించడం, ఉక్రెయిన్ నుంచి ప్రజలను రష్యన్ ఫెడరేషన్ కు చట్టవిరుద్ధంగా బదిలీ చేశారనే అనుమానం వ్యక్తి చేసింది.

ICC issues arrest warrant against Vladimir Putin: అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు వ్యతిరేకంగా అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఉక్రెయిన్ లో జరిగిన యుద్ధ నేరాలకు సంబంధించి ఐసీసీ ఈ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలోనే పిల్లలను చట్టవిరుద్ధంగా బహిష్కరించడం, ఉక్రెయిన్ నుంచి ప్రజలను రష్యన్ ఫెడరేషన్ కు చట్టవిరుద్ధంగా బదిలీ చేశారనే అనుమానం వ్యక్తి చేసింది.
వివరాల్లోకెళ్తే.. ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతోంది. వార్ రెండు దేశాలతో పాటు యావత్ ప్రపంచంపై ప్రభావం చూపుతోంది. రెండు దేశాల్లో పెద్దమొత్తంలో నష్టం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. చాలా దేశాలు యుద్ధాన్ని ఆపాలని కోరుతున్న రష్యా వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్ లో జరిగిన యుద్ధ నేరాలకు సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కారణమని ఆరోపిస్తూ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) శుక్రవారం అరెస్టు వారెంట్ జారీ చేసింది. అయితే, ఏడాదిపాటు సాగిన ఆక్రమణలో తమ దళాలు పొరుగుదేశానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలను పుతిన్ సర్కారు నిరంతరం ఖండిస్తూ వస్తోంది.
మైనర్లను చట్టవిరుద్ధంగా బహిష్కరించడం, ఉక్రెయిన్ భూభాగం నుంచి ప్రజలను రష్యన్ ఫెడరేషన్ కు చట్టవిరుద్ధంగా తరలించడం వంటి ఆరోపణలపై పుతిన్ కు ఐసీసీ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఉక్రెయిన్ ఆక్రమిత భూభాగాల నుంచి ప్రజలను (పిల్లలను) చట్టవిరుద్ధంగా రష్యా సమాఖ్యకు బదిలీ చేయడం వంటి యుద్ధ నేరానికి పుతిన్ కారణమని కోర్టు ఒక ప్రకటనలో తెలిపింది. "ఉక్రెయిన్ పిల్లల పట్ల పక్షపాతంతో ఉక్రెయిన్ ఆక్రమిత ప్రాంతాల నుంచి ప్రజలను చట్టవిరుద్ధంగా రష్యన్ ఫెడరేషన్ కు బదిలీ చేయడం వంటి యుద్ధ నేరానికి బాధ్యత వహిస్తాడని నమ్మడానికి సహేతుకమైన ఆధారాలను ఐసీసీ ప్రీ-ట్రయల్ ఛాంబర్ కనుగొంది" అని ఐసీసీ పేర్కొంది.
ఉక్రెయిన్ వివాదంపై దర్యాప్తులో మొదటిదిగా కోర్టు వారెంట్లు జారీ చేయనున్నట్లు రాయిటర్స్ ఈ వారం ప్రారంభంలో నివేదించింది. ఇవే ఆరోపణలపై రష్యా బాలల హక్కుల కమిషనర్ మరియా అలెక్సీవ్నా ల్వోవా-బెలోవాకు కోర్టు అరెస్టు వారెంట్లు జారీ చేసింది.
'జస్ట్ ఇనిషియల్ స్టెప్': ఐసీసీ వారెంట్ పై ఉక్రెయిన్ రియాక్షన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు అరెస్టు వారెంట్ జారీ చేయాలని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు తీసుకున్న నిర్ణయం రష్యా ఆక్రమణ తర్వాత న్యాయాన్ని పునరుద్ధరించడంలో మొదటి అడుగు మాత్రమేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ చెప్పినట్టు ఏఎఫ్ పీ నివేదించింది.