ఉద్యోగితో రాసలీలల ఎఫెక్ట్: ఇంటెల్ సీఈఓ బ్రియాన్ రాజీనామా

First Published 22, Jun 2018, 6:06 PM IST
Intel CEO Krzanich Is Out After Having Relationship With Employee
Highlights

రాసలీలలతో సీఈఓ ఉద్యోగానికి ఎసరు


న్యూయార్క్: ఇంటెల్ కంపెనీ సీఈఓ ఉద్యోగానికి రాసలీలలు ఎసరు తెచ్చిపెట్టాయి. కంపెనీ విధానాలకు విరుద్దంగా  ఇంటెల్ సీఈఓ బ్రియాన్ జానిచ్ వ్యవహరించినందుకుగాను ఆయనను రాజీనామమా చేయాలని  కంపెనీ కోరింది.  ఈ మేరకు ఆయన రాజీనామా కూడ సమర్పించారు. ఈ రాజీనామాను కంపెనీ బోర్డు అంగీకరించింది.

ఇంటెల్ లో పనిచేసే ఓ ఉద్యోగితో  ఇంటెల్ సీఈఓ రాసలీలలు నడిపాడు.  ఈ విషయమై  కంపెనీ దృష్టికి వచ్చింది. కంపెనీ నియమ నిబంధనలకు విరుద్దంగా  బ్రయాన్ వ్యవహరించారని భావించిన ఆ సంస్థ రాజీనామా చేయాలని ఆయనను ఆదేశించింది. దీంతో ఆయన రాజీనామా చేశారు.

అయితే బ్రయాన్‌తో రాసలీలలు నడిపిన  ఉద్యోగిని ఎవరనే విషయమై వెల్లడించేందుకు కంపెనీ ప్రతినిధులు నిరాకరించారు.  బ్రియాన్ స్థానంలో  మరొకరిని  నియమించే వరకు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్  బాబ్ స్వాన్ తాత్కాలిక సీఈఓగా వ్యవహరించనున్నారు.  అయితే కొత్త సీఈఓగా కోసం అన్వేషిస్తున్నట్టు కంపెనీ ప్రకించింది.

1982లో ఇంటెల్ సంస్థలో ఇంజనీర్‌గా బ్రియాన్ చేరాడు. అప్పటికే అతడి వయస్సు 58 ఏళ్ళు.  కంపెనీలో పలు హోదాల్లో ఆయన పనిచేశారు.  ఇంటెల్ తన 50 ఏళ్ళ చరిత్రలో  మొదటి నుండి  ఉద్యోగులకు ర్యాంకులు ఇవ్వడం ద్వారానే పదోన్నతులు కల్పిస్తోంది. ఇలానే ఆయన 2013లో సీఈఓగా  పదోన్నతి పొందారు.

loader