ఇండోనేషియాలోని పాలూ నగరంలో సంభవించిన సునామీ ధాటికి మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇవాళ ఉదయానికి 420గా ఉన్న మృతుల సంఖ్య మధ్యాహ్నానికి రెట్టింపైంది.

ఇండోనేషియాలోని పాలూ నగరంలో సంభవించిన సునామీ ధాటికి మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇవాళ ఉదయానికి 420గా ఉన్న మృతుల సంఖ్య మధ్యాహ్నానికి రెట్టింపైంది.

ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 832 మంది సునామీ ఘటనలో మరణించారు... వెతికే కొద్దీ మృతదేహాలు బయటపడుతూ ఉండటం.. భవనాలు కూలిపోవడం...శిధిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూ ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మరోవైపు గాయపడిన వారి సంఖ్య 700 వరకు చేరింది. సునామీ ధాటికి ఆసుపత్రులు కూడా కూలిపొవడంతో ఉన్న కొన్నింటిలోనే చికిత్స అందిస్తున్నారు.. ఆసుపత్రులు సరిపోకపోవడంతో కొందరికి రోడ్డుమీదే వైద్యం అందిస్తున్నారు.. దేశంలోని ఇతర నగరాల నుంచి వైద్యులు, సహాయక బృందాలు వచ్చి పాలూ నగరంలో బాధితులను ఆదుకుంటున్నాయి. 

ఇండోనేషియాలో భారీ భూకంపం: సునామీ హెచ్చరికలు జారీ

ఇండోనేషియాలో భారీ భూకంపం... 384 కి చేరిన మృతుల సంఖ్య