ఇండోనేషియాలో  శుక్రవారం నాడు భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై భూకంపతీవ్రత 7.5గా నమోదైంది.


జకార్తా:ఇండోనేషియాలో శుక్రవారం నాడు భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై భూకంపతీవ్రత 7.5గా నమోదైంది. సునామీ హెచ్చరికలను కూడ ఇండోనేషియా ప్రభుత్వం జారీ చేసింది.

ఇండోనేషియాలోని సులవేశి ప్రాంతంలో బారీ భూకంపం సంభవించింది. గంటల వ్యవవధిలోనే ఇదే ప్రాంతంలో వరుస భూకంపాలతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.5గా నమోదైంది. సునామీ హెచ్చరికలను కూడ ఇండోనేషియా ప్రభుత్వం జారీ చేసింది. 

ఇండోనేషియాలోని మధ్య సులవేశి, పశ్చిమ సులవేశి రాష్ట్రాల్లో సునామీ వచ్చే అవకాశం ఉందని భూభౌతిక శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ ప్రాంతాల్లో ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు.

అమెరికా భూబౌతిక శాస్త్రవేత్తలు ఇండోనేషియాలో సంభవించిన భూకంపం అతి శక్తివంతమైందిగా గుర్తించారు. మొదటి భూకంపం కంటే రెండో భూకంపం అతి శక్తివంతంగా ఉందని ప్రకటించారు.

ఈ భూకంపం వల్ల ఒకరు మృతి చెందగా, 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇదిలా ఉంటే 2018 జూలై, ఆగష్టు మాసాల్లో వరుసగా ఇండోనేషియాలో సంభవించిన భూకంపాల వల్ల 500 మంది మృత్యువాతపడ్డారు.