Asianet News TeluguAsianet News Telugu

ఇండోనేషియాలో భారీ భూకంపం... 384 కి చేరిన మృతుల సంఖ్య

దీవుల సముదాయమైన ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించింది. శుక్రవారం ఇక్కడి స్వల్పంగా కంపించి భారీ నష్టానికి కారణమైంది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 7.5 గా నమోదయ్యింది. నెల రోజుల వ్మయవధిలోనే ఇలా భూకంపం సంభవించడం ఇది రెండోసారి.

48 dead, hundreds injured in Indonesia earthquake
Author
Indonesia, First Published Sep 29, 2018, 12:43 PM IST

దీవుల సముదాయమైన ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించింది. శుక్రవారం ఇక్కడి స్వల్పంగా కంపించి భారీ నష్టానికి కారణమైంది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 7.5 గా నమోదయ్యింది. నెల రోజుల వ్మయవధిలోనే ఇలా భూకంపం సంభవించడం ఇది రెండోసారి.

ఈ భూకంప తీవ్రతకు చాలా ఇండ్లు నెలమట్టమయ్యాయి. ఈ ప్రకృతి విపత్తులో మొదట  48 మంది మృతి చెందినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. అయితే ఇలా ప్రకటించిన కొద్ది గంటల్లోపే మృతుల సంఖ్య 384కి చేరినట్లు ఈ సంస్థ ప్రకటించింది. ఇంకా చాలా మంది తీవ్రంగా గాయపడగా మరికొందరి ఆచూకీ తెలియకుండా ఉందని అధికారులు వెల్లడించారు. అందువల్ల మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది.   

ముఖ్యంగా ఈ భూకంప తీవ్రత సులవేసి ద్వీపంలో పాలూ నగరంలో అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ భూకంపం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది.  అలలు 3 మీటర్ల ఎత్తులో ఎగిసిపడుతున్నాయి. దీంతో అధికారులు తీర ప్రాంత ప్రజలను, మత్స్యకారులను హెచ్చరించారు. 

ఈ భూకంప ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల క్రింద చిక్కుకున్న వారికి కాపాడుతున్నారు. అలాగే ఇంకా ప్రమాదం పొంచివున్న ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios