ఇండోనేషియాలో భారీ భూకంపం (earthquake) సంభవించింది. తూర్పు ఇండోనేషియాలో (Indonesia) రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రతతో  భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ నేపథ్యంలోనే ప్రమాదకర అలలు ఎగసిపడే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం (Pacific Tsunami Warning Center) తెలిపింది.  

ఇండోనేషియాలో భారీ భూకంపం (earthquake) సంభవించింది. తూర్పు ఇండోనేషియాలో (Indonesia) రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. మౌమెరే (Maumere) పట్టణానికి ఉత్తరాన 100 కిలోమీటర్ల దూరంలో.. ఫ్లోర్స్ సముద్రంలో (Flores Sea) 18.5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టుగా పేర్కొంది. భారీ భూకంపం చోటుచేసుకున్న నేపథ్యంలో ఇండోనేషియా వాతావరణ శాఖ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం (Pacific Tsunami Warning Center) ఇలాంటి హెచ్చరికలే జారీచేసింది. భూకంప కేంద్రం నుంచి 1,000 కి.మీ‌ లోపు తీర ప్రాంతాల్లో ప్రమాదకర అలలు ఎగసిపడే అవకాశం ఉందని తెలిపింది.

ఇక, 2004లో ఇండోనేషియాలో చివరిసారిగా సునామీ సంభవించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 26న వాయువ్య సుమత్రా తీరంలో 9.1 తీవ్రతతో భూకంపం సంభించింది. ఆ తర్వాత సునామీ రావడంతో.. ఇండోనేషియా, శ్రీలంక, భారతదేశం, థాయ్‌లాండ్‌తో పాటు మరో తొమ్మిది దేశాలకు చెందిన 2,20,000 మంది చ‌నిపోయారు. ఇందులో ఇండోనేషియా ప్ర‌జ‌లే 1,70,000 ఉన్నారు.