Asianet News TeluguAsianet News Telugu

ఇండోనేషియాలో భూకంపం ఎఫెక్ట్: 3జైళ్లు ధ్వంసం, ఖైదీలు ఏమయ్యారంటే..!

ఇండోనేషియాలోని సులవెసి ద్వీపంలో సంభవించిన భారీ భూకంపం, సునామి భారీ విధ్వంసాన్నే సృష్టించింది. సునాబీ భీభత్సానికి పాలూనగరం కకావికలమైంది. సుమారు 844 మందిని బలితీసుకుంది. దీంతో సులవెసి ద్వీపం మృతదేహాలతో స్మశాన వాటికను తలపించింది. 
 

Indonesia earthquake and tsunami: 1,425 prisoners are missing from jails
Author
Indonesia, First Published Oct 1, 2018, 4:08 PM IST

జకార్తా: ఇండోనేషియాలోని సులవెసి ద్వీపంలో సంభవించిన భారీ భూకంపం, సునామి భారీ విధ్వంసాన్నే సృష్టించింది. సునాబీ భీభత్సానికి పాలూనగరం కకావికలమైంది. సుమారు 844 మందిని బలితీసుకుంది. దీంతో సులవెసి ద్వీపం మృతదేహాలతో స్మశాన వాటికను తలపించింది. 

ఇకపోతే ఈ సునామీ భీభత్సం కారణంగా ద్వీపంలోని మూడు జైళ్లు ధ్వంసం అయ్యాయి. దీంతో 1,425 మంది ఖైదీలు పరారయ్యినట్లు ఇండోనేషియా న్యాయ శాఖ మంత్రి యాసన్నో లాలీ స్పష్టం వెల్లడించారు. పాలూ నగరంలో జైలు గోడలు కూలిపోవడంతో ఖైదీలు అక్కడి నుంచి పారిపోయినట్లు మంత్రి తెలిపారు. 

సునామీ ధాటికి నీరు భారీగా జైల్లోకి ప్రవేశించడంతో భయాందోళనకు గురైన ఖైదీలు అక్కడ నుంచి రోడ్లమీదకి పరుగులు తీశారని మంత్రి చెప్పుకొచ్చారు. మరోవైపు భూకంప భయంతో చాలా మంది ఖైదీలు పారిపోయారని, ఇది ఖైదీల చావుబతుకులకు సంబంధించిన సమస్య అని స్పష్టం చేశారు. మరోచోట ఖైదీలు ప్రాణభయంతో జైలు ప్రధాన ద్వారం ధ్వంసం చేసి పారిపోయారన్నారు.

డోంగ్‌గలాలోని జైలులో మంటలు చెలరేగడంతో అందులో ఉన్న 343 మంది తప్పించుకున్నారని న్యాయశాఖ మంత్రి తెలిపారు. సునామీ తమ ప్రాంతంలో బీభత్సం సృష్టించిదన్న విషయం తెలుసుకున్న ఖైదీలు తమ వారిని చూడాలని డిమాండ్‌ చేశారని అయితే జైలు అధికారులు ఒప్పుకోకపోవడంతో ఆగ్రహంతో ఖైదీలు జైలుకు నిప్పంటించినట్లు తెలుస్తోందని  స్పష్టం చేశారు. 

ప్రస్తుతం పాలూ నగరంలోని రెండు జైళ్లలో కేవలం వంద మంది మాత్రమే ఖైదీలు ఉన్నట్లు మంత్రి స్పష్టంచేశారు. సునామీ విలయం కారణంగా భారీ నష్టం జరగడంతో అక్కడి భద్రతా సిబ్బంది ఖైదీలకు ఆహారం అందించేందుకు చాలా కష్టపడాల్సి వస్తోందని, అక్కడ ఎక్కువ రోజులు ఆహారం దొరికే పరిస్థితి కూడా లేదని తెలిపారు. 

పాలూ నగరంలో బీచ్‌ ఫెస్టివల్‌కు వచ్చిన ఎంతో మంది సముద్రంలో కొట్టుకుపోయారన్నారు. పాలూ నగరవీధులన్నీ మృతదేహాలతో నిండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలతో ఉన్న వారు ఆహారం, తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ఇండోనేషియాలో భారీ భూకంపం: సునామీ హెచ్చరికలు జారీ

ఇండోనేషియాలో భారీ భూకంపం... 384 కి చేరిన మృతుల సంఖ్య

 

Follow Us:
Download App:
  • android
  • ios