షార్జా నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఇండిగో విమానం పాకిస్తాన్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానం హైదరాబాద్‌కు వస్తున్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తినట్టుగా పైలట్ గుర్తించాడు. దీంతో విమానాన్ని పాకిస్తాన్‌లోని కరాచీ విమానాశ్రయానికి మళ్లించారు

షార్జా నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఇండిగో విమానం పాకిస్తాన్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానం హైదరాబాద్‌కు వస్తున్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తినట్టుగా పైలట్ గుర్తించాడు. దీంతో విమానాన్ని పాకిస్తాన్‌లోని కరాచీ విమానాశ్రయానికి మళ్లించారు. ముందు జాగ్రత్త చర్యగా మాత్రమే విమానాన్ని కరాచీలో ల్యాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. కరాచీలో షార్జా- హైదరాబాద్ విమానాన్ని ల్యాండింగ్ చేసినట్టుగా ఏఎన్‌ఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. 

అయితే కరాచీలో ఎయిర్‌పోర్ట్‌లో విమానంలో సాంకేతిక లోపాన్ని పరిశీలిస్తున్నారు. మరోవైపు ప్రయాణికులను హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు మరో విమానాన్ని కరాచీకి పంపాలని ఇండిగో ఎయిలైన్స్ సంస్థ భావిస్తుంది. ఇక, గత రెండు వారాల వ్యవధిలో భారతీయ విమానయాన సంస్థకు చెందిన విమానం కరాచీలో ల్యాండ్ కావడం ఇది రెండోది. జూలై 5వ తేదీన ఢిల్లీ నుంచి దుబాయ్‌కి వెళ్లే స్పైస్‌జెట్ విమానంలో ఇండికేటర్ లైట్ పనిచేయకపోవడంతో కరాచీకి మళ్లించిన సంగతి తెలిసిందే. 


Scroll to load tweet…