Asianet News TeluguAsianet News Telugu

మాతృభూమిపై భారతీయుల ప్రేమ తగ్గదు: జపాన్ లో నరేంద్ర మోడీ

జపాన్ లో ప్రవాస భారతీయులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం నాడు సమావేశమయ్యారు. భారతీయ సంప్రదాయాలు జపాన్ లో భారతీయ సంస్కృతి కొనసాగడం గర్వంగా ఉందన్నారు. 

Indians Get Attached to Karmbhoomi But Love for Matribhoomi Never Fades Away: PM to Diaspora
Author
Japan, First Published May 23, 2022, 4:47 PM IST

టోక్యో: Japan లో భారతీయ సంస్కృతి కొనసాగడం గర్వంగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. Tokyo లో ప్రవాస భారతీయులతో ప్రధాని Narnendra Modi సోమవారం నాడు భేటీ అయ్యారు. ప్రధానికి భారతీయులు ఘనంగా స్వాగతం పలికారు.  Indian ను మీరు మరువలేదన్నారు.భారతీయ సంప్రదాయాలను ప్రవాస భారతీయులు కొనసాగించడం గర్వంగా ఉందని మోడీ చెప్పారు. జపాన్ కు వచ్చినప్పుడల్లా తనకు అమితమైన ప్రేమ ఇక్కడ దక్కుతుందన్నారు. భారతీయులు తమ కర్మభూమితో తమ అనుబంధాలను కలిగి ఉన్నారన్నారు. మన మాతృభూమి పట్ల ప్రేమ ఎప్పటికీ కూడా తగ్గదన్నారు. మాతృభూమికి దూరంగా ఉండలేమని కూడా చెప్పారు. ఇది మన అతి పెద్ద బలాల్లో కూడా ఒకటని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.

Chicago కు వెళ్లే ముందు స్వామి వివేకానంద జపాన్ కు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. స్వామి వివేకానంద మనసులో జపాన్ చెరగని ముద్ర వేసిందని మోడీ అభిప్రాయపడ్డారు. బుద్దుడు చూపిన మార్గంలో నేటి ప్రపంచం నడవాల్సిన అవసరం ఉందన్నారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అన్ని సవాళ్ల నుండి మానవాళిని రక్షించడానికి ఇదే మార్గమన్నారు.  

జపాన్ తో ఇండియాకు ఉన్న సంబంధం బుద్దుడు, జ్ఞానం, ధ్యానం అని మోడీ చెప్పారు. భారత్, జపాన్ లు సహజ భాగస్వామ్యులని మోడీ చెప్పారు. భారత అభివృద్ది ప్రయాణంలో జపాన్ కీలక పాత్ర పోషించిందన్నారు. జపాన్ తో  ఇండియా సంబంధం ఆద్యాత్మికత సహకారానికి సంబంధించిందన్నారు. జపాన్ ప్రజలకు ఉన్న అవగాహనను ఆయన ముక్త కంఠంతో కొనియాడారు.

జపాన్ లోని భారతీయ కమ్యూనిటీ హృదయ పూర్వక ఆదరణకు మోడీ ధన్యవాదాలు చెప్పారు.  జపాన్ భాష, దుస్తులు, సంస్కృతి, ఆహారం ఒక విధంగా మీ జీవితంలో ఓ భాగంగా మారాయన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios