ఫ్యామిలీ సెపరేషన్: భారతీయ తల్లీకొడుకులపై ట్రంప్ దెబ్బ

Indian Woman In US Separated From 5-Year-Old Son With Disability: Report
Highlights

అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని జీరో టోలెరెన్స్ పేరిట కుటుంబాల నుండి విడదీసి నిర్భంద కేంద్రాలలో ఉంచుతున్న సంగతి తెలిసినదే. 

అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని జీరో టోలెరెన్స్ పేరిట కుటుంబాల నుండి విడదీసి నిర్భంధ కేంద్రాలలో ఉంచుతున్న సంగతి తెలిసిందే. ఇలా నిర్బంధానికి గురైన వారిలో మన భారతీయులు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా.. ఇందుకు సంబంధించిన వివరాలు కూడా వెల్లడయ్యాయి.

మెక్సికో సరిహద్దుల నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడి, పిల్లలకు దూరమైన వారిలో భారత్‌కు చెందిన ఓ మహిళ కూడా ఉందని వాషింగ్టన్‌ పోస్ట్‌ ప్రచురించింది. గుజరాత్‌కు చెందిన భావన్‌ పటేల్‌ అనే 33 ఏళ్ల మహిళను నిర్భంధంచారని, ఆమెకు వికలాంగుడైన 5 ఏళ్ల కుమారుడు ఉన్నాడని పేర్కొంది.

ప్రస్తుతం కొడుకును అమెరికా ప్రభుత్వం తల్లి నుంచి వేరుచేసి నిర్బంధ కేంద్రంలో ఉంచింది. అయితే, ఆమె ఎప్పుడు అరెస్టయిందనే విషయాన్ని మాత్రం ఆ పోస్ట్‌లో పేర్కొనలేదు. అహ్మాదాబాద్ నుంచి పారిపోయిన భావన్ పటేల్ గ్రీస్ మీదుగా మెక్సికో చేరుకొని అక్కడి నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.

loader