ఆర్ధిక శాస్త్రంలో భారతీయుడికి మరోసారి ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం లభించింది. భారత సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీ, ఆయన భార్య ఎస్తర్ డఫ్లో‌, మైఖేల్ క్రెమర్‌లను ఈ ఏడాది నోబెల్ కమిటీ ఎంపిక చేసింది.

కోల్‌కతాలో జన్మించిన ఆయన అంతర్జాతీయంగా పేదరికాన్ని ఎదుర్కొనే అంశంలో పరిష్కారాలు చూపినందుకు గాను బెనర్జీకి ఈ పురస్కారం దక్కింది. భార్య ఎస్తర్ డఫ్లో, మైఖేల్ క్రెమర్‌తో కలిసి అభిజిత్ త్వరలో నోబెల్ పురస్కారాన్ని అందుకోనున్నారు.