కరోనాతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. అయితే ఓ వ్యక్తికి మాత్రం ఉద్యోగం పోయినా, అదృష్టం కలిసి వచ్చింది. అదీ లాటరీ రూపంలో వరించింది. యునైటైడ్ అరబ్ ఎమిరేట్స్ లో నిర్వహించిన ఓ లక్కీ డ్రాలో భారత్ కు చెందిన ముప్పైయేళ్ల నవనీత్ సంజీవన్ మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు. 

కేరళ్లోని కాసర్ గొడ్ కు చెందిన నవనీత్ సంజీవన్ ఉద్యోగం కోసం అరబ్ దేశం వెళ్లారు. గత నాలుగేళ్లుగా అబుదాబీలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. కాగా కొవిడ్ కారణంగా కంపెనీ నష్టాల్లో పడి, అతడి ఉద్యోగం పోయింది. ప్రస్తుతం నోటీస్ పీరియడ్ లో ఉన్నాడు. 

అయితే గత నవంబర్ 22న నవనీత్ దుబాయి డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రా కోసం ఆన్ లైన్ లో లాటరీ టికెట్ కొన్నాడు. ఆదివారం ఈ డ్రా తీయగా నవనీత్ ను అదృష్టం వరించింది. ిందులో ఆయన ఒక మిలియన్ డాలర్ల నగదు బహుమతి గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా గల్ఫ్ న్యూస్ తో మాట్లాడుతూ అస్సలు నమ్మశక్యంగా లేదు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సంతోషాన్ని స్నేహితులు, తోటి ఉద్యోగులతో పంచుకోవాలనుకుంటున్నా.. అని సంతోషం వ్యక్తం చేశారు.