Asianet News TeluguAsianet News Telugu

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ భారతీయుడికి రూ.11 కోట్ల పరిహారం.. యూఏఈ కోర్టు సంచలన నిర్ణయం.. 

2019లో దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది భారతీయుల సహా 17 మంది చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే..ఈ ఘటనలో గాయపడిన భారతీయ వ్యక్తికి 5 మిలియన్ల దిర్హామ్స్ ( అంటే.. రూ.11 కోట్లు) నష్టపరిహారం పొందారు. 

Indian Injured In 2019 Dubai Bus Crash Awarded 11 Crore Compensation
Author
First Published Apr 7, 2023, 6:50 PM IST

ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారతీయుడికి దుబాయ్ కోర్టు భారీ నష్ట పరిహారం అందించింది. దాని మొత్తం ఎంతో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఈ ఘటన సుమారు 3 సంవత్సరాల క్రితం నాటిది. ఒమన్ నుండి దుబాయ్‌కి బస్సులో ప్రయాణిస్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ  భారతీయ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. దుబాయ్ కోర్టు ఇప్పుడు ఆ  యువకుడికి 5 మిలియన్ దిర్హామ్‌లను నష్ట పరిహారంగా ప్రకటించింది.భారతీయ కరెన్సీ ప్రకారం, ఈ మొత్తం ₹ 11 కోట్లు.

ఖలీజ్ టైమ్స్ మీడియా కథనం ప్రకారం.. మహ్మద్ బేగ్ మీర్జా అనే ఇంజినీరింగ్ విద్యార్థి  ఈద్ అల్-ఫితర్ సెలవులను బంధువులతో గడిపి మస్కట్ నుండి దుబాయ్‌కి తిరిగి వస్తుండగా ప్రమాదం సంభవించింది. బస్సులో 12 మంది భారతీయులతో సహా మొత్తం 31 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు డ్రైవర్ అల్ రషీదియా మెట్రో స్టేషన్ పార్కింగ్ ప్రవేశ ద్వారం వద్ద ఓవర్ హెడ్ హైట్ బారియర్‌ను ఢీకొట్టడంతో బస్సు ఎడమ వైపు పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో ఒమన్‌కు చెందిన డ్రైవర్‌కు 7 సంవత్సరాల జైలు శిక్ష విధించిన స్థానిక కోర్టు.. బాధిత కుటుంబాలకు 3.4 మిలియన్ దిర్హామ్ చెల్లించాలని ఆదేశించింది.

14 రోజులు కోమాలో

తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన మీర్జా దాదాపు 14 రోజుల పాటు అపస్మారక స్థితి(కోమా)లో ఉన్నాడు. దాదాపు రెండు నెలలకు పైగా ఆసుపత్రిలో చిక్సిత పొందాడు. ఆ తర్వాత కూడా పునరావాస కేంద్రంలో చికిత్స పొందారు. ప్రమాదం కారణంగా మెదడు దెబ్బతినడంతో మీర్జా సాధారణ జీవితానికి తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వైద్యులు తెలిపారు.

అతడు మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చదువుతోన్న సమయంలో ప్రమాదం జరిగింది. కానీ ప్రమాదం కారణంగా తన చదువును పూర్తి చేయలేకపోయాడు. తల, చెవులు, నోరు, ఊపిరితిత్తులు, చేతులు,కాళ్లకు కూడా గాయాలైనట్టు ఫోరెన్సిక్ వైద్య నిపుణులు అంచనా వేశారు. మీర్జా మెదడుకు శాశ్వతంగా 50 శాతం నష్టం వాటిల్లిందని తెలిపిన నివేదిక ఆధారంగా నష్టపరిహారం చెల్లించాల్సిందిగా  యూఏఈ సుప్రీం కోర్టు బీమా కంపెనీని ఆదేశించింది.
 
గాయపడిన వ్యక్తి ఆటగాడు కూడా

ముహమ్మద్ బేగ్ మీర్జా తన శరీర భాగాల పనితీరును కోల్పోవడమే కాకుండా సంతోషకరమైన జీవితం , ఉజ్వల భవిష్యత్తును కోల్పోయాడని సీనియర్ కన్సల్టెంట్ ఆసా అనీస్ ఖలీజ్ టైమ్స్‌తో అన్నారు. అతను చాలా తెలివైన విద్యార్థి, వర్సిటీ ఫుట్‌బాల్ , వాలీబాల్ జట్లలో సభ్యుడు కూడా. ఈ ప్రమాదం కారణంగా తన కుటుంబం మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని చవిచూసిందని అనీస్ తెలిపారు. జీవితాన్ని మార్చే ఈ ప్రమాదం నుండి కుటుంబం కోలుకోవడానికి ఈ మొత్తం పాక్షికంగా సహాయపడుతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇన్సూరెన్స్ అథారిటీ 

మీర్జా లాయర్ల ప్రకారం.. ప్రాథమిక పరిష్కార కోర్టు అతనికి మొదట 1 మిలియన్ దిర్హామ్‌లను పరిహారంగా ఇచ్చింది. పిటిషనర్లు దుబాయ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కోర్టును ఆశ్రయించడంతో  అతని పరిహారం మొత్తాన్ని 5 మిలియన్ దిర్హామ్‌లకు సవరించిందని నివేదిక పేర్కొంది. ప్రమాదం తరువాత, ఒమన్‌కు చెందిన డ్రైవర్‌కు ఏడేళ్ల జైలు శిక్ష విధించబడింది. బాధిత కుటుంబాలకు 3.4 మిలియన్ దిర్హామ్‌లను చెల్లించాలని ఆదేశించింది.

Follow Us:
Download App:
  • android
  • ios