Iran Israel War: అప్రమత్తంగా ఉండండి.. హెల్ప్‌లైన్ నంబర్లను జారీ చేసిన భారత ఎంబసీ..

Iran Israel War: పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సలహా జారీ చేయబడింది. అలాగే..  తక్షణ సహాయం కోసం రాయబార కార్యాలయం కోసం  హెల్ప్‌లైన్ నంబర్లను జారీ చేసింది.  

Indian embassy in Israel releases emergency helpline numbers amid Iran attack krj

Iran Israel War: పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అందరూ ఊహించినట్లుగానే ఇజ్రాయెల్‌పై ఇరాన్ 200 డ్రోన్లు, క్షిపణులతో శనివారం రాత్రి దాడికి పాల్పడింది. ఇరాన్‌ మిత్రదేశాలు సైతం ఇజ్రాయెల్‌ను టార్గెట్ చేస్తున్నాయి. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ డజన్ల కొద్దీ క్షిపణులు, డ్రోన్‌లతో ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ఈ దాడితో యావత్ ప్రపంచం అప్రమత్తమైంది. ఇరాన్ ఈ దాడి ఆపరేషన్‌కు 'ట్రూ ప్రామిస్' అని పేరు పెట్టింది. 

ఈ నేపథ్యంలో భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయుల కోసం భారత రాయబార కార్యాలయం ఆదివారం కీలక సూచనలు జారీ చేసింది. ఇజ్రాయెల్‌లోని భారతీయ పౌరులందరూ ప్రశాంతంగా ఉండాలని,  స్థానిక అధికారులు జారీ చేసిన భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరించాలని సూచించింది. ఎంబసీ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని, ఇజ్రాయెల్ అధికారులు మరియు భారతీయ కమ్యూనిటీ సభ్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, పరిస్థితిని పరిష్కరించేలా చూడాలని సలహాదారు చెప్పారు.
  
దీనితో పాటు, భారతదేశం తన పౌరుల భద్రత కోసం తక్షణ సహాయం కోసం రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కోరింది. దీని కోసం భారత్ ఎమర్జెన్సీ నంబర్‌ను కూడా షేర్ చేసింది. మెయిల్ ఐడీ, తద్వారా ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంప్రదించవచ్చు. అలాగే.. మధ్యప్రాచ్య దేశాలలో పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తన పౌరుల కోసం ప్రత్యేక ప్రయాణ సలహాను జారీ చేసింది.

ప్రస్తుతానికి ఇరాన్ లేదా ఇజ్రాయెల్‌కు వెళ్లవద్దని భారతీయులందరికీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది. ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న ప్రజలు భారత రాయబార కార్యాలయాలను సంప్రదించాలని కోరారు. అలాగే జాగ్రత్తగా ఉండాలని, వారి కార్యకలాపాలను పరిమితం చేయాలని కోరారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios