Zimbabwe Plane Crash | ఘోర విమాన ప్రమాదం.. జింబాబ్వేలో భారతీయ బిలియనీర్‌ సహా ఆరుగురు దుర్మరణం 

Zimbabwe Plane Crash | జింబాబ్వేలో  ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భారత సంతతికి చెందిన బిలినియర్‌, మైనింగ్ వ్యాపారవేత్త హర్పాల్ సింగ్ రంధావా , ఆయన తనయుడితో పాటు మరో నలుగురు దుర్మరణం చెందారు.  

Indian Billionaire Harpal Randhawa, his Son Killed In Zimbabwe Plane Crash KRJ

Zimbabwe Plane Crash | జింబాబ్వేలో  ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భారత సంతతికి చెందిన బిలియనీర్‌, ఆయన తనయుడితో పాటు మరో నలుగురు దుర్మరణం పాలయ్యారు. భారత్‌కు చెందిన హర్పాల్ సింగ్ రంధావా రియోజిమ్‌ పేరుతో మైనింగ్‌ కంపెనీని నిర్వహిస్తున్నారు. అలాగే నికెల్‌, రాగి తదితర లోహాలను శుద్ధి చేస్తుంటారు. జింబాబ్వే రాజధాని హరారే నుంచి మురోవా వజ్రాల గనికి వెళ్తుండగా ప్రైవేట్‌ జెట్‌లో వెళ్తున్న సమయంలో మషావా ప్రాంతంలో విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో విమానంలో ఉన్న ఆరుగురు మరణించారు.

జింబాబ్వే నుండి వస్తున్న నివేదికల ప్రకారం.. భారతీయ బిలియనీర్ వ్యాపారవేత్త హర్పాల్ రాంధావా, అతని కుమారుడు విమాన ప్రమాదంలో మరణించారు. హర్పాల్ రాంధావాకు చెందిన ప్రైవేట్ విమానం సాంకేతిక లోపం కారణంగా నైరుతి జింబాబ్వేలోని వజ్రాల గని వద్ద కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. బంగారం, బొగ్గు ఉత్పత్తి చేయడంతోపాటు నికెల్, రాగిని శుద్ధి చేసే ప్రముఖ భారతీయ కంపెనీ రియోజిమ్ యజమాని హర్పాల్ రాంధావా. ఆయనతో పాటు అతని కుమారుడు, మరో నలుగురితో ప్రత్యేక విమానంలో ప్రయాణిస్తున్నారు. 

జింబాబ్వేలోని స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. వ్యాపారవేత్త హర్పాల్ రంధవాకు చెందిన విమానం జింబాబ్వేలోని ఇహరారేలోని జ్వామహండే ప్రాంతంలో కూలిపోయింది. రియోజిమ్‌కు చెందిన సెస్నా 206 విమానం హరారే నుంచి మురోవా వజ్రాల గనికి వెళ్తుండగా శుక్రవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. రియోజిమ్‌కు చెందిన మురోవా డైమండ్స్ గని సమీపంలో సింగిల్ ఇంజిన్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానం సిబ్బందితో సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. జ్వామహండే ప్రాంతంలో విమానం కూలిపోవడానికి ముందు విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని, దీని కారణంగానే విమానం గాలిలోనే పేలిపోయిందని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ ప్రాణాలు కోల్పోయారని స్థానిక నివేదిక పేర్కొంటున్నాయి. 

ప్రభుత్వ యాజమాన్యంలోని దినపత్రిక ది హెరాల్డ్, స్థానిక పోలీసులు ఘటనను ఉటంకిస్తూ.. బాధితుల్లో నలుగురు విదేశీయులు, మిగిలిన ఇద్దరు జింబాబ్వేలు ఉన్నారు. విమాన ప్రమాదంలో ఆరుగురు మరణించినట్లు జింబాబ్వే రిపబ్లిక్ పోలీసులు ధృవీకరించారు. హర్పాల్ రాంధావా కంపెనీ కూడా  రియోజిమ్ ప్రమాదాన్ని ధృవీకరించింది.

మరింత సమాచారాన్ని సేకరించేందుకు సంబంధిత అధికారులతో కలిసి పని చేస్తున్నామని చెప్పారు. మృతుల పేర్లను పోలీసులు ఇంకా విడుదల చేయలేదు. రంధావా US$4 బిలియన్ల ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అయిన GEM హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు. ఇదిలా ఉండగా, విమాన ప్రమాదం తర్వాత జరిగిన పరిణామాలను నిర్వహించడానికి స్థానిక కమ్యూనిటీ , లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు కలిసి పనిచేస్తున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios