అమెరికాలో భారత సంతతికి మరో కీలక పదవి దక్కనుంది. ఎయిర్‌ఫోర్స్ ఇన్‌స్టలేషన్, ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ అసిస్టెంట్ సెక్రెటరీ పదవికి నామినేట్ చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భావిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పెంటగాన్ పదవి కోసం యునైటెడ్ స్టేట్స్ సెనేట్ ఆమోదించాల్సి ఉన్నది. 

వాషింగ్టన్: Americaలో india సంతతికి మరో కీలక పదవి దక్కనుంది. రక్షణ వ్యవస్థలో ఓ టాప్ పొజిషన్‌కు ఇండియన్ అమెరికన్ రవి చౌదరిని అమెరికా అధ్యక్షుడు Joe Biden నామినేట్ చేయాలని ఉద్దేశించినట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. Air Force ఇన్‌స్టలేషన్, ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ అసిస్టెంట్ సెక్రెటరీ పదవికి నామినేట్ చేసింది. ఈ పెంటగాన్ పదవి కోసం యునైటెడ్ స్టేట్స్ సెనేట్ ఆమోదించాల్సి ఉంది.

యూఎస్ రవాణా శాఖలో అడ్వాన్స్‌డ్ ప్రొగ్రామ్స్, ఇన్నోవేషన్, కమర్షియల్ స్పేస్ ఆఫీసు, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ఈ పదవిలో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) కమర్షియల్ స్పేస్ ట్రాన్స్‌పోర్టేషన్ మిషన్‌కు అవసరమైన అడ్వాన్స్‌డ్ డెవలప్‌మెంట్, రీసెర్చ్ కార్యక్రమాలకు డైరెక్టర్‌గా వ్యవహరించారు.

ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌లో పనిచేసినప్పుడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేసినప్పుడు దేశవ్యాప్తంగా తొమ్మిది లొకేషన్‌లలో ఏవియేషన్ ఆపరేషన్లకు కీలక బాధ్యతలు వహించారు.

Also Read: భారత్‌లోనూ బైడెన్‌లున్నారు.. నాకు లేఖ రాశారు.. మోడీ భేటీలో యూఎస్ అధ్యక్షుడి సరదా సంభాషణ

1993 నుంచి 2015లో యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌లొ యాక్టివ్ డ్యూటీ చేసినప్పుడు ఆపరేషనల్, ఇంజినీరింగ్, సీనియర్ స్టాఫ్ అసైన్‌మెంట్స్ పనులనూ సంపూర్తిగా నిర్వహించారు.

సీ-17 పైలట్‌గా గ్లోబల్ ఫ్లైట్ ఆపరేషన్స్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్‌లపై యుద్ధ ప్రాజెక్టులనూ నిర్వహించారు. ఇరాక్‌లో పర్సన్నల్ రికవరీ సెంటర్, మల్టీ నేషనల్ కార్ప్స్, గ్రౌండ్ డెప్లాయిమెంట్‌లకు డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించారు.