ఆఫ్ఘనిస్తాన్‌లో మిగిలిపోయిన భారతీయుల తరలింపు కోసం కేంద్రం ప్రత్యేక ఆప‌రేష‌న్  చేపట్టింది. దీనికి ‘‘ ఆపరేషన్ దేవి శ‌క్తి ’’గా పేరు పెట్టింది. ఈ విష‌యాన్ని తెలుపుతూ భార‌త విదేశాంగ మంత్రి జైశంక‌ర్ ట్వీట్ చేశారు. ఈ రోజు భార‌తీయులు స‌హా మొత్తం 78 మందిని కాబూల్ నుంచి త‌జ‌కిస్థాన్‌లోని దుషన్బే మీదుగా తీసుకొస్తున్న‌ట్లు ఆయన తెలిపారు

ఆఫ్ఘనిస్థాన్‌లో అధికారాన్ని తాలిబ‌న్లు అందుకోవడంతో ప్రస్తుతం అక్కడి ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అన్ని దేశాలు వారి పౌరులను ఆఫ్గన్ నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే ప్రతికూల పరిస్ధితుల్లోనూ భారత్ మాత్రం అత్యంత వ్యూహాత్మకంగా పౌరులను తరలిస్తోంది. ఇప్పటికే పలు విడతలుగా పౌరులు, దౌత్య సిబ్బంది, అధికారులు భారత్‌కు సురక్షితంగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిపోయిన భారతీయుల కోసం కేంద్రం ప్రత్యేక ఆప‌రేష‌న్ చేపట్టింది. దీనికి ‘‘ ఆపరేషన్ దేవి శ‌క్తి ’’గా పేరు పెట్టింది. ఈ విష‌యాన్ని తెలుపుతూ భార‌త విదేశాంగ మంత్రి జైశంక‌ర్ ట్వీట్ చేశారు.

ఈ రోజు భార‌తీయులు స‌హా మొత్తం 78 మందిని కాబూల్ నుంచి త‌జ‌కిస్థాన్‌లోని దుషన్బే మీదుగా తీసుకొస్తున్న‌ట్లు ఆయన తెలిపారు. ఈ ఆప‌రేష‌న్ చేప‌డుతోన్న భార‌త వైమానిక సిబ్బంది, విదేశాంగ శాఖ అధికారుల‌ను ఆయ‌న ప్ర‌శంసించారు. ఆప‌రేష‌న్ దేవి శ‌క్తి కొన‌సాగుతోంద‌ని చెప్పారు.

Also Read:కాబూల్‌లో ఉక్రెయిన్ ప్లేన్ ఎత్తుకెళ్లారు: ఔను.. హైజాక్ చేశారన్న డిప్యూటీ మినిస్టర్

కాగా, దుషన్బే నుంచి భార‌త్ కు 25 మంది భార‌తీయులు స‌హా 78 మంది విమానంలో బ‌య‌లుదేరిన వీడియోను ఓ అధికారి పోస్ట్ చేశారు. మరోపక్క, ఆఫ్ఘ‌న్‌లో తాలిబ‌న్ల అరాచ‌కాలు కొన‌సాగుతున్నాయి. ప్ర‌సిద్ధ గ‌జిని ప్రావిన్స్ గేటును తాలిబ‌న్లు కూల్చివేశారు. ఇందుకు స‌బంధించిన వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది