ప్రస్తుతం భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవానికి కారణమైన B.1.617 53 దేశాలకు పాకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. అయితే అనధికారిక సమాచారం ప్రకారం.. మరో ఏడు దేశాలకు కూడా ఆ వెరియేంట్ విస్తరించింది. దాంతో B.1.617 రకం బయటపడిన దేశాల సంఖ్య 60కి చేరినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవానికి కారణమైన B.1.617 53 దేశాలకు పాకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. అయితే అనధికారిక సమాచారం ప్రకారం.. మరో ఏడు దేశాలకు కూడా ఆ వెరియేంట్ విస్తరించింది. దాంతో B.1.617 రకం బయటపడిన దేశాల సంఖ్య 60కి చేరినట్లు తెలుస్తోంది. ఈ కొత్త రకం వేగంగా సంక్రమిస్తోందని, అయితే దీని బారిన పడినవారిలో తీవ్రత ఏవిధంగా ఉంటుందనేదానిపై అధ్యయనం జరుగుతోందని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. 

బ్రిటన్‌ (B.1.1.7), దక్షిణాఫ్రికా(B.1.351), బ్రెజిల్‌(P.1), భారత్‌(B.1.617)లో మొదట గుర్తించిన కరోనా వెరియేంట్‌లను ప్రమాదకర రకాలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గీకరించింది. ఇవి పలు దేశాలకు విస్తరించి వైరస్ వ్యాప్తిని మరింత పెంచాయి. 149 దేశాల్లో B.1.1.7 రకం, 102 దేశాల్లో B.1.351, 59 దేశాల్లో P.1 రకాన్ని గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అలాగే B.1.617 రకాన్ని మూడుగా విభజించింది. అవి..B.1.617.1, B.1.617.2, B.1.617.3.

Also Read:ఈ ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి మృతి

వీటిలో మొదటిది 41 దేశాలకు, రెండవది 54 దేశాలకు, మూడవది ఆరు దేశాలకు విస్తరించినట్లు తెలిపింది. మొత్తంగా భారత్ రకాన్ని 53 దేశాల్లో గుర్తించినట్లు పేర్కొంది. కరోనా వైరస్ ఎంతగా విస్తరిస్తే.. అన్ని కొత్త రకాలు వెలుగుచూసే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 16 కోట్ల మందికి పైగా కరోనా బారిన పడగా.. 35లక్షలకు పైగా మరణాలు సంభవించినట్లు వరల్డో మీటర్ చెబుతోంది.