ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు లేఖ రాశారు. పొరుగునే ఉన్న పాక్ తో తాము సత్సంబంధాలనే కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. అయితే దీనికి ఓ నమ్మకమైన వాతావరణాన్ని మాత్రం కల్పించాల్సిన అవసరం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు.

అంతేకాకుండా ఉగ్రవాదానికి తావులేని వాతావరణాన్ని కూడా కల్పించాల్సిన బాధ్యత పాక్‌పైనే ఉందని మోడీ కుండబద్దలు కొట్టారు. పాకిస్తాన్ నేషనల్ డేను పురస్కరించుకుని ప్రధాని మోదీ పాక్ ప్రధానికి లేఖ రాశారు. ‘ఓ పొరుగుదేశంగా మీతో సత్సంబంధాలను కోరుకుంటున్నాం. దీనికోసం విశ్వసనీయ వాతావరణాన్ని కల్పించాల్సి ఉంది. అంతే కాకుండా ఉగ్రవాదానికి తావులేని వాతావరణం కూడా కల్పించాలి’ అని మోడీ ఆ లేఖలో పేర్కొన్నారు.

అంతేకాకుండా ముకుతాడు వేసే క్రమంలో ప్రభుత్వం చేసిన పోరాటాన్ని కూడా మోడీ అభినందించారు. కోవిడ్ ను సమర్థంగా ఎదుర్కొన్న ప్రజలకు శుభాకాంక్షలు అని మోడీ అన్నారు. అయితే ఈ లేఖ ప్రతి ఏడాది పంపిన ఈ క్రమంలోనే ప్రత్యేక అధికారులు స్పష్టం చేస్తున్నారు.