లండన్:  కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో  భారత్ ను రెడ్ లిస్ట్ లో చేర్చింది యూకే.  బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇండియా పర్యటన రద్దైన కొద్దిగంటల్లోనే  ఆ దేశం ఈ నిర్ణయం తీసుకొంది.   ఈ ఏడాదిలో రెండోసారి బ్రిటన్ ప్రధాని  ఇండియా టూర్ రద్దైంది.

 ఇండియాతో పాటు సుమారు 40 దేశాలను  బ్రిటన్ రెడ్ లిస్ట్ లో చేర్చింది.  రెడ్ లిస్ట్ జాబితాలో ఉన్న దేశానికి చెందిన పౌరులు యూకేలో నిషేధం విధించారు. బ్రిటీష్ లేదా ఐరిష్ జాతీయులైతే  యూకేలో నివాస హక్కులు కలిగి ఉంటేనే ప్రవేశానికి అనుమతి  లభిస్తోంది. అయితే  ప్రభుత్వం నిర్ధేశించిన క్వారంటైన్ సెంటర్లలో 10 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలి.బంగ్లాదేశ్, కెన్యా, పాకిస్తాన్, పిలిఫ్పిన్స్ దేశాలపై  యూకే ఇప్పటికే నిషేధం విధించింది.

ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ  వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకొంది. ఈ ఏడాది మే 1 నుండి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలని నిర్ణయం తీసుకొంది.