అమెరికా నూతన అధ్యక్షుడిగా బైడెన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ కూడా ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే అతిథుల కోసం ప్రత్యేక వంటకాలు తయారవుతున్నాయి.

శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ప్రముఖ చెఫ్ రాబర్ట్ డోర్సీ అతిథులకు అద్భుతమైన రుచికరమైన వంటలు టేస్ట్ చేయించబోతున్నాడు. ప్రమాణస్వీకార విందులో కమలా హారిస్ కు ఇష్టమైన వంటకం సీఫుడ్ ‘గంబో’ను కూడా చేర్చారు. ఇదే ఈ విందులో ప్రత్యేకంగా ఉండబోతోంది. 

‘గంబో’ అంటే ఒక చిక్కనైన సూపు. దీన్ని షెల్ ఫిష్ లేదా మాంసం, కాప్సికం, ఉల్లిపాయలతో తయారు చేస్తారు. ‘గంబో’ లూసియానా రాష్ట్ర అధికారిక వంటకం కావడం కూడా విశేషం. తనకు కూడా ‘గంబో’ అంటే చాలా ఇష్టమని, తాను చిన్నప్పుడు కమలా హారిస్ తో కలిసి చదువుకున్నానని చెఫ్ రాబర్ట్ డోర్సీ చెబుతున్నాడు. 

డిన్నర్ మెనూలో వంటకాలు ఇవే..

ఎపిటైజర్ గా :  పాంకో క్రస్టెడ్ క్రాబ్ కేక్స్, ఆర్గానిక్ కోస్టల్ గ్రీన్స్

మెయిన్ డిష్ లు : ‘గంబో’తో పాటు వైట్ రైస్, లూసియానా లవ్, డీప్ అంబర్ రౌక్స్, స్వీట్ పెప్పర్స్, బ్లాకెన్ డ్ చికెన్.

స్వీట్లు : బనానా రైసిన్ బ్రెడ్ పుడ్డింగ్, బౌర్ బోన్ కారమెల్