ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామాతో మరోసారి బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. దీంతో బ్రిటన్ రాజకీయం మళ్లీ మొదటికొచ్చింది. ఇంతకుముందు ట్రస్‌తో పోటీ పడిన రిషి సునాక్ మళ్లీ రేసులోకి వచ్చారు. మరోవైపు.. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా తిరిగి ప్రధాని పోటీలోకి వచ్చారు.
బ్రిటన్ రాజకీయాలు చాలా ఆసక్తి కరంగా మారాయి. ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామాతో మరోసారి బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. బోరిస్ జాన్సన్ రాజీనామా తర్వాత బ్రిటన్ లో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఉండగా .. ఆయనను వెనక్కి నెట్టేసి ప్రధాని పీఠాన్ని లిజ్ ట్రస్ అధిష్ఠించారు. అయితే.. కేవలం 45 రోజులకే ఆమె రాజకీయ ప్రస్థానం ముగిసింది. దీంతో బ్రిటన్ లో మరోసారి రాజకీయ సంక్ష్ోభం నెలకొంది.
ఈ నేపథ్యంలో ప్రధాని ఎన్నిక మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఈ రేసులో ఇంతకుముందు ప్రధాని ఎన్నికల్లో ట్రస్‌తో పోటీ పడిన రిషి సునాక్ ప్రస్థావన మళ్లీ తెర మీదకి వచ్చింది. ఈ తరుణంలో అనుహ్యంగా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా తిరిగి ప్రధాని పోటీలోకి వచ్చారు. అయితే.. ప్రధాని పోటీలో నిలిచే వారు కన్జర్వేటివ్ చట్ట సభ నుంచి కనీసం వంద మంది మద్దతు ఉండాలి.అందుకోసం అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు.
నేను మాత్రమే పార్టీని రక్షించగలను: జాన్సన్
మరోవైపు .. రాజకీయ గందరగోళం మధ్య బోరిస్ జాన్సన్ కన్జర్వేటివ్ ఎంపీలకు డిసెంబర్ 2024 ఎన్నికలలో ఓటమి నుండి పార్టీని రక్షించగలననీ వాదన చేస్తున్నాడని ది టెలిగ్రాఫ్ నివేదిక పేర్కొంది. పార్లమెంట్‌లో భారీ మెజారిటీ ఉన్న అధికార పార్టీ ప్రజాభిమానం కోల్పోవడంతో విపక్షాలు మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. బోరిస్ జాన్సన్ ఇప్పుడు రిషి సునక్‌కు మద్దతు ఇవ్వాలని, తిరిగి రావాలని ఒత్తిడి చేస్తున్నాడని టెలిగ్రాఫ్ నివేదిక పేర్కొంది.
పోటీ ఆ ముగ్గురు మధ్యనే
పెరుగుతున్న ధరలు,పన్నులను తగ్గించడంలో వైఫల్యం కారణంగా లిజ్ ట్రస్ తన పదవీ నుంచి వైదొలిగింది. బ్రిటీష్ దేశచరిత్రలో అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధాన మంత్రిగా నిలిచారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన 45వ రోజున ఆమె తన పదవికి రాజీనామా చేసి..మరో వారం పాటు తాత్కాలిక ప్రధానమంత్రి పదవిలో కొనసాగుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రధాని రేసులో రిషి సునక్ , బోరిస్ జాన్సన్‌లతో పాటు హౌస్ ఆఫ్ కామన్స్ నాయకుడు పెన్నీ మార్దౌంట్ కూడా పోటీలో ఉన్నారు. అంతకుముందు.. రక్షణ మంత్రి బెన్ వాలెస్, ఆర్థిక మంత్రి జెరెమీ హంట్‌లు కూడా ప్రధాని పోటీలో ఉన్నారు. కానీ.. తర్వాత ఇద్దరూ వెనక్కి తగ్గారు. బెన్ వాలెస్ జాన్సన్‌కు మద్దతు ఇవ్వగలడు.
జాన్సన్ కు తగ్గిన ప్రజాధరణ.. సునక్‌పై దృష్టి
బోరిస్ జాన్సన్ కష్టాల మధ్య మొదటి ప్రధానిగా మూడేళ్లు పూర్తి చేసుకున్నారు. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో జరిగిన పార్టీ అతని బహిష్కరణకు కారణం. కానీ, అతనికి కన్జర్వేటివ్ ఎంపీలు , పార్టీలోని ఒక వర్గం మద్దతు ఉంది. అతను తనని తాను ప్రజాదరణ పొందిన వ్యక్తిగా చూస్తాడు. కానీ, కొన్ని పోల్ సర్వేలు ప్రస్తుతం ఓటర్లలో ఆయనకు తక్కువ ఆదరణ ఉన్నట్లు చూపిస్తున్నాయి. జాన్సన్.. లిజ్ ట్రస్ కంటే ఎక్కువ జనాదరణ పొందారని ప్రముఖ ఏజెన్సీ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది,
అయినప్పటికీ సర్వేలో పాల్గొన్న చాలా మంది ప్రజలు ఆమెపై ప్రతికూల అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో UK ఆర్థిక మంత్రిగా ఉన్న మిలియనీర్ ఆర్థిక సలహాదారు, వ్యాపారవేత్త రిషి సునక్‌పై అందరి దృష్టి ఉంది.
బ్రిటీష్ మీడియా నివేదికల ప్రకారం.. బ్రిటన్ తదుపరి ప్రధాని రేసులో రిషి సునక్ ముందంజలో ఉన్నట్లు చెప్పబడింది. కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ రేసులో రిషి సునక్‌ను ఓడించిన తర్వాత లిజ్ ట్రస్ ఆరు వారాల ముందు జాన్సన్‌ను భర్తీ చేసింది. అలాగే.. పలు ఒపీనియన్ పోల్స్ ప్రకారం.. వచ్చే ఎన్నికల్లో కన్జర్వేటివ్‌లకు ఓటమి తప్పదు. వచ్చే ఎన్నికల్లో కన్జర్వేటివ్ ల పతనం ఖాయమని చెబుతున్నాయి. కేవలం ఆరేళ్లలో ఐదో బ్రిటిష్ ప్రధాని కోసం పోటీ జరుగుతోంది. బ్రిటన్ తదుపరి ప్రధాని ఎవరనేది సోమవారం లేదంటే శుక్రవారం ప్రకటించే అవకాశం ఉంది.
