Asianet News TeluguAsianet News Telugu

అమెరికాలో సిక్కు కుటుంబం హ‌త్య కేసు.. కోర్టులో ప‌శ్చాత్తాప ప‌డ‌ని నిందితుడు..

అమెరికాలో హత్యకు గురైన భారత సంతతి కుటుంబం హత్య కేసు గురువారం కోర్టులో విచారణకు వచ్చింది. అయితే ఈ విచారణలో తాను నిందితుడిని అని, ఏ తప్పు చేయలేదని నిందితుడు వాదించాడు. తన మాటల్లో కొంత కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. ఈ కేసు డిసెంబర్ 15వ తేదీన మళ్లీ విచారణకు రానుంది. 

In the murder case of a Sikh family of Indian descent in America, the accused argued that he was innocent in the court.
Author
First Published Oct 14, 2022, 10:00 AM IST

అమెరికాలోని కాలిఫోర్నియాలో భారతీయ సంతతికి చెందిన సిక్కు కుటుంబానికి చెందిన నలుగురిని ఇటీవ‌ల ఓ దుండ‌గుడు కిడ్నాప్ చేసి హ‌త్య చేశాడు. ఈ హత్యల్లో ప్రధాన నిందితుడు జీసస్ సల్గాడోను ఘటన జరిగిన చాలా రోజుల తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే గురువారం ఈ కేసుపై కోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా నిందితుడు తాను ఏ నేరం చేయ‌లేదని, నిర్దోషిని అని వాదించాడు. పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేదు. తాను నేరాన్ని అంగీకరించబోన‌ని కోర్టుకు తెలిపాడు. అయితే ఒక వేళ నిందితుడు దోషిగా తేలితే అత‌డు విడుద‌ల కావ‌డానికి అన్ని అవ‌కాశాలు మూసుకుపోతాయి. జీవితాంతం జైలులోనే గడ‌పవ‌ల‌సి ఉంటుంది. 

ప్రియురాలితో షాపింగ్.... భార్యకు అడ్డంగా దొరికిపోయిన భర్త....!

భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రం మూలాలున్న కుటుంబం అమెరికాలోని కాలిఫోర్నియాలో నివ‌సించేది. కుటుంబంలోని న‌లుగురు సభ్యులైన జస్దీప్ సింగ్ (36), జస్లీన్ కౌర్ (27), వారి ఎనిమిది నెలల కుమార్తె ఆరోహి, 39 ఏళ్ల అమన్‌దీప్ సింగ్‌లను నిందితుడు జీసస్ సల్గాడో తుపాకీతో బెదిరించి కిడ్నాప్ చేశాడు. అనంత‌రం వారిని దారుణంగా హ‌త్య చేశాడు. అక్టోబర్ 6వ తేదీన అత‌డిని పోలీసులు ప‌ట్టుకున్నారు. 

మొద‌ట‌గా ఆ సిక్కు కుటుంబం క‌నిపించ‌కుండా పోయింద‌ని అంద‌రూ అనుకున్నారు. అందుకే  అక్టోబ‌ర్ 3వ తేదీన ఆ కుటుంబం అదృశ్యంపై విచారణ ప్రారంభమైంది. అయితే వింటన్ నగరంలో పోలీసులు అమన్‌దీప్‌కు చెందిన ట్రక్కును కాలిపోయినట్లు గుర్తించారు. అందులో ఎవ‌రూ మృతి చెందిన‌ట్టు పోలీసులు కనుగొనలేకపోవడంతో.. ఆ కుటుంబం మొత్తం తప్పిపోయినట్లు పోలీసులు అనుకున్నారు. కిడ్నాప్ జరిగిన రెండు రోజుల తర్వాత కాలిఫోర్నియాలోని మారుమూల ప్రాంతంలో వారి మృత‌దేహాలు ల‌భ్యం అయ్యాయి.

మాస్కో-డిల్లీ ఫ్లైట్ కు బాంబు బెదిరింపు: దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు

అయితే ఈ ఘ‌ట‌న లో మెర్సిడ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం నుండి ఒక విడుద‌ల అయ్యింది. ఇందులో ఒక అనుమానితుడు తుపాకీతో ఆ సిక్కు కుటుంబాన్నిబెదిరించి, వారిని అపహరించి ట్రక్కులోకి తీసుకువెళ్లాడు. అనంత‌రం వారిని హ‌త్య చేశార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కాగా..  ఈ ఘ‌ట‌న‌పై భారతీయ సంతతికి చెందిన సిక్కుల బంధువులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వారంతా క‌లిసి కాలిఫోర్నియాలో 300,000 యూఎస్ డాల‌ర్ల కంటే ఎక్కువ సేక‌రించారు. మృతుల కుటుంబ స‌భ్యులైన వృద్ధ తల్లిదండ్రులు భార‌త్ లోనే ఉన్నాయి.

కర్వాచౌత్ నాడు ఉపవాసం చేస్తున్న భార్యపై భర్త దాడి.. 12 కత్తిపోట్లతో మహిళ పరిస్థితి విషమం...

కాగా.. ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన‌ట్టు చెబుతున్న‌ నిందితుడు గతంలో కూడా పలు నేరాలకు పాల్పడ్డాడ‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ట్రక్కుకు నిప్పంటించడం, అక్రమంగా తుపాకీని కలిగి ఉండటం, కాల్చడం వంటి అభియోగాలు కూడా ఉన్నాయి. అతడి సోదరుడు అల్బెర్టో సల్గాడో కూడా నేరపూరిత కుట్ర, సాక్ష్యాలను నాశనం చేశారనే అనుమానంతో ఈ కేసులో అరెస్టుకు గుర‌య్యాడు.  స‌ల్గాడో 2005లో ఒక కుటుంబాన్ని తుపాకీతో దోచుకున్నాడు. ఈ కేసులో అత‌డు దాదాపు ఒక దశాబ్దం జైలు జీవితం గడిపాడు. తాజా కేసులో కోర్టులో త‌న నేరాలను అంగీకరించవద్దని కోర్టును అభ్యర్థించారు. అయితే ఈ కేసు డిసెంబరు 15వ తేదీన మ‌ళ్లీ విచార‌ణ‌కు రానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios