వాషింగ్టన్: ఆల్‌ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ పై దాడి గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గుర్తు చేసుకొన్నారు.ఏ ప్రామిస్డ్ ల్యాండ్ పేరుతో ఒబామా పుస్తకం రాశాడు. ఈ పుస్తకంలో లాడెన్‌ను మట్టుబెట్టిన విషయాన్ని  ఆయన ప్రస్తావించారు.

పాకిస్తాన్ మిలిటరీ కంటోన్మెంట్ శివారులో గల ఓ సురక్షిత ప్రాంతంలో లాడెన్ ఉన్నట్టుగా తమకు కచ్చితమైన సమాచారం అందిందన్నారు.  ఈ విషయమై అప్పటి జాతీయ భద్రతా సలహాదారు టామ్ డోనిలన్, అప్పటి సీఐఏ అధికారి జాన్ బ్రెన్నన్ లను అడిగినట్టుగా చెప్పారు.

ఈ విషయం గురించి బయటకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకొన్నామన్నారు.   లాడెన్ దాక్కొన్న ప్రదేశం పాకిస్తాన్ మిలటరీ కంటోన్మెంట్ కు కొన్ని మైళ్ల దూరంలోనే ఉంది. ఈ ఆపరేషన్ గురించి పాకిస్తాన్ కు సమాచారం ఇవ్వలేదని ఆయన ఆ పుస్తకంలో రాశాడు.

సమాచారాన్ని సేకరించి లాడెన్  ఉన్న కాంపౌండ్ ను వైమానిక దాడులతో ధ్వంసం చేయాలి, ఇక రెండోది ప్రత్యేక కమాండో ఆపరేషన్ చేపట్టాలి.లాడెన్ ను అంతమొందించేందుకు కమాండో ఆపరేషన్ ను చేపట్టినట్టుగా ఆయన తెలిపారు. 

also read:రాహుల్ గాంధీ టీచర్ ను ఇంప్రెస్ చేసే విద్యార్థిలాంటివాడు: ఒబామా

కమాండో ఆపరేషన్ ను అప్పటి రక్షణ శాఖ మంత్రి రాబర్ట్ గేట్స్ వ్యతిరేకించినట్టుగా ఆయన చెప్పారు.  అప్పటి ఉపాధ్యక్షుడు జో బైడెన్  కూడ వ్యతిరేకించారని గుర్తు చేసుకొన్నారు.

కమాండో ఆపరేషన్ విజయవంతమైందని ఆయన చెప్పారు. ఈ విషయమై పలు దేశాల  అధినేతలు ఫోన్లు చేసి అభినందించారన్నారు.పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కూడ ఫోన్ చేసి తనను అభినందించారని ఆయన చెప్పారు. 

పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ కూడ ఈ ఆపరేషన్ ను అభినందించారని ఆయన గుర్తు చేసుకొన్నారు. ఈ ఆపరేషన్ ను ఆయన అభినందించారు.ఉగ్రవాదుల చేతుల్లో తన భార్య బెనజీర్ భుట్టో  హత్యకు గురికావడాన్ని ఆయన తనతో పంచుకొన్నారని  జర్దారీ గుర్తు చేసుకొన్నారని ఆ పుస్తకంలో  ఒబామా రాశాడు.