వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రాసిన  రాజకీయ జ్ఞాపకం పుస్తకంలో కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ ల గురించి ప్రస్తావించారు.

అమెరికాలోని పలువురు నాయకులతో పాటు ఇతర దేశాలకు చెందిన పలువురి నేతల గురించి ఈ పుస్తకంలో ఒబామా ప్రస్తావించారు. న్యూయార్క్ టైమ్స్ ఈ పుస్తకం గురించి ప్రచురించింది.2009  నుండి 2017 వరకు అమెరికా అధ్యక్షుడిగా ఒబామా కొనసాగిన విషయం తెలిసిందే.

రష్యా అధ్యక్షుడు పుతిన్, అప్పటి రక్షణ కార్యదర్శి బాబ్ గేట్స్ , అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ గురించి ప్రస్తావించాడు.ఈ  పత్రిక కథనం ప్రకారంగా  రక్షణ శాఖ సెక్రటరీ  బాబ్ గేట్స్, భారత మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ లు ఒకే రకమైన చిత్తశుద్దిని కలిగి ఉన్నారని ఆ పుస్తకంలో రాశాడు.

ఈ పుస్తకంలో రాహుల్ గాంధీ గురించి ఒబామా కీలక వ్యాఖ్యలు చేశాడు.  ఉపాధ్యాయుడిని ఆకట్టుకొనేందుకు స్టూడెంట్ లాంటివాడిగా పేర్కొన్నారు.రాహుల్ గాంధీ ఏదైనా విషయంపై అవగాహన పెంచుకొనే రకం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

అమెరికా అధ్యక్షుడిగా ఒబామా ఉన్న సమయంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2017 డిసెంబర్ చివర్లో ఒబామా ఇండియాలో పర్యటించారు.ఈ సమయంలో ఒబామాను రాహుల్ గాంధీ కలిశారు. ఈ సమావేశం గురించి రాహుల్ గాంధీ అప్పట్లో ట్వీట్ చేశారు.

2015 రిపబ్లిక్ డే వేడుకలకు అమెరికా అధ్యక్షుడు ఒబామా ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ పర్యటనలో మోడీతో కలిసి ఒబామా మన్ క్ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.జో బైడెన్ ఒక మంచి నిజాయితీ గల నమ్మకమైన వ్యక్తి అని ఆయన చెప్పారు. చికాగో యంత్రాన్ని నడుపుతున్న కఠినమైన వీధి స్మార్ట్ వార్డ్ ఉన్నతాధికారులను పుతిన్  గుర్తు చేస్తాడని ఒబామా చెప్పారు.

2003 నుండి 2013 వరకు చైనా అధ్యక్షుడిగా ఉన్న హు జింటావో గురించి కూడ ఈ పుస్తకంలో ఒబామా రాశాడు. ఓ ప్రైవేట్ సమావేశంలో తామిద్దరం పేపర్లు మార్పిడి చేసుకొన్నట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు. తిరిక సమయంలో ఈ పేపర్లను చదివినట్టుగా ఆయన చెప్పారు.59 ఏళ్ల ఒబామా రెండు బాగాలుగా ఈ పుస్తకాన్ని రాశాడు.