Asianet News TeluguAsianet News Telugu

బైడెన్ డిజిటల్ టీం లోకి భారతీయ మహిళ

భారత్ కి చెందిన ఈషా షా కి వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ డిజిటల్ స్ట్రాటజీ భాగస్వామ్య మేనేజర్ గా నియమించారు. ఈషా కశ్మీర్ లో జన్మించింది. 

In Biden's Digital Team, India-Born Aisha Shah Bags Senior Position
Author
Hyderabad, First Published Dec 29, 2020, 10:29 AM IST

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ మరో భారతీయ మహిళకు కీలక బాధ్యతలు అప్పగించారు. వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ డిజిటల్ స్ట్రాలజీ భాగస్వామ్య మేనేజర్ గా మరో భారతీయురాలిని నియమించారు.  ఇప్పటికే.. బైడెన్ టీంలో పలువురు భారతీయులకు చోటు కల్పించగా.. తాజాగా.. మరొకరికి కల్పించడం విశేషం.

భారత్ కి చెందిన ఈషా షా కి వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ డిజిటల్ స్ట్రాటజీ భాగస్వామ్య మేనేజర్ గా నియమించారు. ఈషా కశ్మీర్ లో జన్మించింది. డిజిటల్‌ స్ట్రాటజీ డైరెక్టర్‌గా రాబ్‌ ప్లాహెర్టీ నేతృత్వం వహించనున్నట్లు బైడెన్‌ ట్రాన్సిషన్‌ బృందం ఒక ప్రకటనలో తెలిపింది. లూసియానాలో పెరిగిన షా గతంలో బైడెన్‌-హారిస్‌ ప్రచారంలో డిజిటల్‌ భాగస్వామ్య నిర్హాకురాలిగా పనిచేశారు. 

ప్రస్తుతం ఆమె స్మిత్సోనియన్‌ ఇన్‌స్టిట్యూషన్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్పెషలిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అంతకుముందు జాన్‌ఎఫ్‌ కెన్నడీ సెంటర్‌ ఫర్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ కార్పోరేట్‌ ఫండ్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గాను, ఇంటిగ్రేటెడ్‌ మార్కెటింగ్‌ సంస్థ బ్యూరు కమ్యూనికేషన్‌ స్పెషలిస్ట్‌గానూ పనిచేశారు.

ఇక ఇప్పటికే బైడెన్‌ తన టీంలో కమలా హారిస్‌ను ఉపాధ్యక్షురాలిగా, నీరా టాండన్‌ను బడ్జెట్ చీఫ్‌గా, వేదాంత్ పటేల్‌లకు వైట్ హౌస్ అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా, వినయ్‌ రెడ్డిని స్పీచ్ రైటింగ్ డైరెక్టర్‌గా నియమించగా.. గౌతమ్‌ రాఘవన్‌కి కీలక బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి జాబితాలో ఈషా షా కూడా చేరారు.
  

Follow Us:
Download App:
  • android
  • ios