2024లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని ఆ దేశ మాజీ అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తన అభ్యర్థిత్వాన్ని కూడా ప్రకటించారు. తాజాగా ట్రంప్ ఈ విషయాన్ని బహిరంగంగా తెలియజేశారు.
అగ్రరాజ్యం అమెరికా రాజకీయాల్లో మళ్లీ ప్రకంపనలు సృష్టించేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. ఆయన మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తన అభ్యర్థిత్వాన్ని కూడా ప్రకటించారు. తాజాగా ట్రంప్ కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. తాను మరోసారి ఎన్నికల బరిలోకి దిగుతానని, త్వరలోనే తన ఉద్దేశ్యాన్ని ప్రజలకు తెలియజేస్తానని ఆయన ఇటీవల చెప్పారు.
నవంబర్ 8న జరిగిన మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ పేలవమైన ప్రదర్శన తర్వాత ట్రంప్ మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేయబోడనే ఊహాగానాలు వచ్చాయి. కానీ బుధవారం.. ఫ్లోరిడాలోని తన నివాసం మార్-ఎ-లాగోలో మీడియాతో మాట్లాడుతూ.. 'ఈ రోజు నేను అమెరికాను గొప్పగా, గర్వించేలా చేయడానికి యునైటెడ్ స్టేట్స్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నాను. అని ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో అమెరికా రాజకీయాల్లో కలకలం చేలరేగే అవకాశముంది.
మూడవసారి అధ్యక్ష బరిలో
గత ఎన్నికల్లో జో బిడెన్ చేతిలో ట్రంప్ ఘోర ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కానీ, పట్టు వదలని విక్రమార్కుడిలా 2024లో అధ్యక్ష పదవికి మూడోసారి పోటీ చేయనున్నారు. తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన ట్రంప్ గత ఎన్నికల ప్రచారం కంటే.. ఈ సారి ఎన్నికల ప్రచారం పూర్తి భిన్నంగా ఉంటుందని చెప్పారు. బుధవారం అమెరికా అధ్యక్ష పదవికి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తానని ట్రంప్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా అధికారాన్ని, ప్రతిష్టను తిరిగి తీసుకురావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన తరుణంలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ఈ ఓటమికి ట్రంప్ కారణమని కొందరు ఆరోపించారు. అంతకుముందు 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బిడెన్ చేతిలో ట్రంప్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.అయితే, తన ఓటమిని అంగీకరించేందుకు ట్రంప్ నిరాకరించారు.
బిడెన్ లక్ష్యంగా పోటీ
ట్రంప్ తన వాదనను ప్రకటిస్తూనే.. బిడెన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బిడెన్ ప్రభుత్వంలో అమెరికా ప్రతిష్ట దెబ్బతిన్నదని ట్రంప్ ఆరోపించారు. బిడెన్ ప్రభుత్వానికి మరో అధికారంలోకి రాకుండా తాను ప్రయత్నిస్తానని అన్నారు.బిడెన్ ప్రభుత్వం లక్షలాది మంది అమెరికన్లను అసంతృప్తికి గురి చేసిందని ఆయన అన్నారు. ప్రపంచంలో అమెరికా గుర్తింపు చాలా దెబ్బతిందని ఆరోపించారు.
అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ట్రంప్ ఏడేళ్ల క్రితం రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం రేసులోకి దిగారు.ప్రారంభంలో అతని అవకాశాలు రాలేదు. కానీ, రిపబ్లికన్ పార్టీకి చెందిన బడా నాయకులు ఓటమి పాలు కావడంతో అతడు పార్టీ నామినేషన్‌ను గెలుచుకున్నాడు. ఆ తర్వాత యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ 2016 అధ్యక్ష ఎన్నికల్లోనూ విజయం సాధించారు.
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వానికి సంబంధించి మాజీ అధ్యక్షుడు ముందస్తుగా ప్రకటించడం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వానికి సంబంధించిన చర్చ మొత్తం ఆయన చుట్టూనే కేంద్రీకృతమై ఉండే వ్యూహమని ట్రంప్ అనుకూల వర్గాలు మీడియాకు తెలిపాయి. దీంతో ఇటీవలి ఎన్నికల్లో పలువురు ముఖ్య అనుచరులు ఓడిపోవడం ఆయన నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసిందన్న ఊహాగానాలకు ప్రారంభమయ్యాయి.
